ఉక్రెయిన్ పై రష్యా బాంబుల మోత మోగిస్తూనే ఉంది. యుద్ధం ప్రకటించి సుమారు మూడో రోజు పూర్తిగా కావస్తు రష్యా ఎక్కడా వెనక్కి తగ్గడం లేదు. యుద్ధం విమానాలు, క్షిపణులతో దాడికి దిగుతోంది. ఇందుకు సంబంధించిన దృశ్యాలు ఎప్పటికప్పుడు ఇటు సామాజిక మాద్యమాలలో కానీ అటు వార్తల్లో కానీ ఓ రేంజ్ లో చూస్తున్నాం. చాలా దేశాలు యుద్ధం ఆపాలని చూసినా సరే రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ వెనక్కి తగ్గకుండా తాను తీసుకున్న నిర్ణయంపై ముందుకు పోతునే ఉన్నారు.
ఇదిలా ఉంటే ఉక్రెయిన్ రాజధాని అయిన కీవ్ లో పరిస్థితులు చాలా భయంకరంగా తయారయ్యాయి. బయటకు వస్తే ఎక్కడ బాంబులు పడతాయో అని గజ గజ వణుకుతున్నారు. ప్రజలంతా ప్రాణ భయంతో ఉన్నారు. అయితే బాంబుల నుంచి తమను తాము రక్షించుకునే దాని దేశం ఏర్పాటు చేసిన కొన్ని బాంబు షేల్టర్లలో ఉంటున్నారు. ఇప్పటికే ఉన్న కొన్ని మెట్రో స్టేషన్ లు అండర్ గ్రౌండ్ లో ఉన్నాయి. అయితే ప్రజలను వాటిలోకి వెళ్లి తల దాచుకుంటున్నారు. అయితే ఇలా ప్రాణాలను కాపాడుకోవడానికి వచ్చి ఓ నిండు చూలాలు ఓ బిడ్డకి జన్మనిచ్చింది. ఈ విషయాన్ని చాలా మంది సోషల్ మీడియాలో షేర్ చేశారు. ప్రస్తుతం ఈ వార్త ప్రపంచ వ్యాప్తంగా ట్రెండింగ్ లో ఉంది.
ఇదిలా ఉంటే ఉక్రెయిన్ లో ప్రజలు రష్యా దాడులను అడ్డుకునేందుకు బంకర్లను ఉపయోగిస్తున్నారు. దాని కోసం ఇప్పటికే నిర్మించి ఉన్న అండర్ గ్రౌండ్ మెట్రోలో బిక్కు బిక్కు మంటూ కాలం వెళ్లతీస్తున్నారు. మూడు రోజులకు పైగా ఫ్లాట్ ఫారమ్ పైనే పడుకుంటున్నారు.