Site icon 123Nellore

నిరూపించకుంటే రాజకీయాల నుండి శాశ్వతంగా తప్పుకుంటా : చంద్రబాబు

బాదుడే బాదుడుకు విరుగుడు టీడీపీయే అని, రాష్ట్రంలో ఇలాంటి పాలన గతంలో ఎప్పుడైనా చూశారా అని టీడీపీ అధినేత చంద్రబాబు అనారు. భీమునిపట్నం మండలం తాళ్లవలసలో బాదుడే బాదుడు కార్యక్రమాన్ని రెండో రోజు నిర్వహించారు.  జగన్ పాలనలో అన్ని వర్గాలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నాయని, అన్ని రాష్ట్రాల కంటే ఏపీలోనే పన్నులు ఎక్కువన్నారు. ఏపీలోనే పన్నులు ఎక్కువ అని నిరూపిస్తానని, లేకుంటే రాజకీయాల నుంచి శాశ్వతంగా తప్పుకుంటానని పేర్కొన్నారు. ’’నేను ఐటీ, ఇంజినీరింగ్ విభాగాల్లో ఉద్యోగాలిచ్చా.. జగన్ వాలంటీర్ ఉద్యోగం తప్ప ఏమైనా ఇచ్చారా? దేశంలోకెల్లా ఏపీలోనే పెట్రోల్, డీజిల్‍కు ఎక్కువ ధర.

టీడీపీ హయాంలో పెట్రోల్‍పై రూ.5 తగ్గించాం. పెట్రోల్, డీజిల్‍పై పన్నులను జగన్ ఎందుకు తగ్గించరు?. ఎవరికీ లేని వింత ఆలోచనలు జగన్‍కు వస్తాయి. కోడి కత్తి, బాబాయి హత్య వంటి ఆలోచనలతో గెలిచారు. నరకాసుర వధ పోరాటంలో అందరూ కలిసిరావాలి. నేను పోరాడేది నా కోసం కాదు.. ప్రజల కోసం. ప్రజలంటే లెక్కలేనితనమా?. జగన్‍రెడ్డిని నమ్ముకోవద్దని ఐఏఎస్ అధికారులకు చెప్పా. ఎనిమిది మంది ఐఏఎస్ అధికారులకు జైలు శిక్ష పడింది.

ఆలిండియా సర్వీస్ అధికారులు ఇష్టానుసారం వ్యవహరించవద్దు. ప్రభుత్వ భవనాలకు వైసీపీ రంగులేశారు. కోర్టు చీవాట్లు పెడితే రంగులు తుడిపించారు. మంత్రిగా బొత్స ఎందుకు ఉన్నారు.. పేపర్లు లేక్ చేసి పరీక్షలు పెట్టడానికా? టెన్త్ పేపర్ల లీక్ వెనుక వైసీపీ నేతల హస్తం ఉంది. పిల్లలు, తల్లిదండ్రుల మనోభావాలతో ఆడుకుంటున్నారు. ఇంకా చాలా అరిష్టాలు మనం చూడబోతున్నాం. రూ.8 లక్షల కోట్లు అప్పులున్నాయి.. మరో రెండేళ్లు ఉంది. ఎవడబ్బ సొమ్మని ఈ డబ్బు ఖర్చు చేస్తున్నారు? జగన్ రెడ్డీ ఒక్క ఛాన్స్ అడిగావు.. ఇదే చివరి ఛాన్స్’’ అని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.

Exit mobile version