Site icon 123Nellore

పోలవరాన్ని టీడీపీ ఎందుకు పూర్తి చేయలేదు : మంత్రి రాంబాబు

టీడీపీ ప్రభుత్వం పోలవరం ప్రాజెక్టును ఎందుకు పూర్తి చేయలేదని నీటిపారుదల శాఖా మంత్రి అంబటి రాంబాబు ప్రశ్నించారు. చంద్రబాబు, టీడీపీ నిర్వాకం వల్ల డయాఫ్రమ్ వాల్ దెబ్బతిందని ఆయన ఆరోపించారు. వైసీపీ కేంద్ర కార్యాలయంలో సోమవారం మీడియాతో మాట్లాడారు. కాఫర్ డ్యామ్ పూర్తి చేయకుండా డయాఫ్రమ్ వాల్ కట్టారని మండిపడ్డారు. టీడీపీ నేతలు దోచుకు తినడానికి  పోలవరాన్ని ఆదాయ వనురుగా ఐదేళ్లు మార్చుకున్నారని విమర్శించారు. డబ్బుల్నీ వృథా చేశారని మండిపడ్డారు. రాష్ట్రానికి పట్టిన శని చంద్రబాబు అని తీవ్ర స్తాయిలో ధ్వజమెత్తారు. టీడీపీకి పట్టిన శని లోకేశ్ అని సొంత పార్టీ కార్యకర్తలు, నాయకులు చెప్పుకుంటున్నారని ఆరోపించారు.

సీఎం జగన్ సుపరిపాలన అందిస్తున్న నాయకుడని ప్రశంసించారు. చట్టానికి ఎవరూ అతీతులు కారని, ఎమ్మెల్సీ అయినా సరే చర్యలు తీసుకోవాల్సిందేనని సీఎం వైఎస్ జగన్ స్పష్టంగా ఆదేశాలు ఇచ్చారని పేర్కొన్నారు. పోలీసులు చర్యలు తీసుకుంటుంటే ఎవరి ఇస్టం వచ్చినట్లు వారు మాట్లాడుతున్నారని దుయ్యబట్టారు. గంటా అరగంట అంటూ పనికిమాలిన మాటలు మాట్లాడుతున్నారని, ఒకసారి ఇంటికెళ్లి ఏం మాట్లాడుతున్నారో ఆలోచించుకోవాలని సూచించారు.

నోటికొచ్చినట్లు మాట్లాడితే చూస్తే ఊరుకోవడానికి వైసీపీ, కార్యకర్తలు ఎవరూ సిద్ధంగా లేరని అన్నారు. తప్పు చేస్తే ఎమ్మెల్సీ అయినా చర్యలు తప్పవన్నారు. మంగళగిరిలో ఓడిపోయిన లోకేశ్ మా గురించి మాట్లాడుతారా అని మండిపడ్డారు. లోకేష్ ఎక్కడో ఒక చోట గెలవాలని, గెలిచిన తర్వాత మాట్లాడాలని విమర్శించారు. టీఎంసీ, క్యూసెక్కులు అంటే ఏంటో తెలియదని తనను అంటున్నారని, ముందు మీకు తెలుసా అని ప్రశ్నించారు. పోలవరాన్ని జగన్మోహన్ రెడ్డే పూర్తి చేసి, నీరిస్తారని స్పష్టం చేశారు.

 

Exit mobile version