Site icon 123Nellore

కుర్చీలు కూడా లేని కార్పొరేషన్లు బీసీలకు ఎందుకు.? : మాజీ మంత్రి యనమల

మంత్రివర్గంలో ఉన్న బీసీలకు పరిపాలనలో ఎలాంటి భాగస్వామ్యంలేదని, కేవలం కేబినెట్లోనే భాగస్వామ్యమని మాజీమంత్రి యనమల రామకృష్ణుడు అన్నారు. మంత్రివర్గ నిర్ణయాలు, మంత్రులుగా ఎవరుండాలనే విషయాల్లో సజ్జల రామకృష్ణారెడ్డే అంతా వ్యవహరిస్తున్నాడని ఆరోపించారు. ముఖ్యమంత్రి బంధువన్న ఒకేఒక్క అర్హత తప్ప, ప్రభుత్వంలో, కేబినెట్ నిర్ణయాల్లో జోక్యంచేసుకునే అధికారం సజ్జల రామకృష్ణారెడ్డికి ఉందా అని ప్రశ్నించారు. గత కేబినెట్ పప్పెట్ కేబినెట్ అయితే ఇప్పుడు కొలువుదీరిన మంత్రివర్గం ఛాయ్ బిస్కెట్ కేబినెట్ అని ఎద్దేవా చేశారు. బీసీలపై జగన్మోహన్ రెడ్డికి ప్రేముంటే ప్రభుత్వ సలహాదారుల నియామకాల్లో, ఇతర త్రాముఖ్యమైన పదవుల్లో ఎందుకు ప్రాతినిధ్యం ఇవ్వలేదన్నారు.

తనపై, తన ప్రభుత్వంపై ప్రజల్లో తిరుగుబాటు మొదలైందని జగన్ కు అర్థమైందని, అందుకే పాత మంత్రివర్గంలోఉన్నవారే 11మంది తిరిగిచోటుదక్కించుకున్నారని విమర్శించారు. నిధులు, విధులు, కూర్చోవడానికి కుర్చీలులేని బీసీ కార్పొరేషన్లతో బడుగులకు ఏం ఒనగూరుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. సజ్జలకు ఉన్నది రాజ్యాంగ పవరా.. ఆయనెప్పుడూ ఎక్స్ ట్రా కాన్ స్టిట్యూషనల్ అథారిటీనే అని అన్నారు. పొలిటికల్ ఆబ్లిగేషన్ ప్రకారం ముఖ్యమంత్రి తన కేబినెట్లో బీసీలకుప్రాధాన్యత ఇవ్వలేదని ఆరోపించారు. మంత్రులకు వాయిస్ లేకపోవడానికి ముఖ్యమంత్రే కారణమని, ముఖ్యమంత్రి డెమోక్రటిక్ డిక్టేటర్ గా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు.

కేబినెట్ మార్చినంత మాత్రాన అధికారంలోకి వస్తామని అనుకోవడం అన్ వాంటెడ్ ఇమాజినేషన్ అని, జగన్మోహన్ రెడ్డి, ఆయన ప్రభుత్వం అధికారంలోకి రావడం ఇక సాధ్యం కాదన్నారు. ఊహాగానాలతో ప్రజలను మాయలోముంచి, వారికిచ్చిన వాగ్దానాలు ఒక్కటీ నెరవేర్చని ఏకైకప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అని దుయ్యబట్టారు. టీడీపీ ప్రభుత్వంలో మంత్రులు ఇప్పుడున్న వారిలా ఏనాడు ప్రవర్తించలేదన్నారు. తానే ఆర్థికమంత్రిగా ఉన్నానని, తన నిర్ణయాల్లో ఎప్పుడూ ముఖ్యమంత్రి జోక్యంచేసుకోలేదన్నారు. తాము ఒకటి అనుకున్నాక, ఆయనతో సంప్రదించి నిర్ణయం తీసుకునేవాళ్లమని గుర్తు చేశారు.

Exit mobile version