Site icon 123Nellore

నిరసనలో ఉద్యోగులు, ఉపాధ్యాయులు.. సీఎం జగన్ పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్న ఉద్యోగస్తులు!

YSRCP: పదేళ్ల రాజకీయ జీవితంలో వైఎస్ఆర్ సీపీ అధినేత గా ఎనిమిదేళ్ల ప్రయాణం చేశాడు వై యస్ జగన్. ఏపీ ప్రతిపక్ష నేతగా ఐదేళ్లు పోరాడి ఇలా అన్నిటిలోనూ ఒంటరిగానే పోరాడుతూ ముందుకు వచ్చాడు. ఇక ఏపీ ప్రభుత్వం లో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకొని ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గా ఓ వెలుగు వెలుగుతున్నాడు జగన్మోహన్ రెడ్డి.

ఇదిలా ఉంటే జగన్ సీఎం బాధ్యతలు చేపట్టి దాదాపు మూడు సంవత్సరాల అవుతున్నప్పటికీ.. అన్నీ రంగాలలో ఉద్యోగుల జీతాల విషయంలో ఏపీ ప్రభుత్వం సరిగ్గా హ్యాండిల్ చేయలేకపోతుందనే చెప్పవచ్చు. ఈ ఫలితంగా ఉద్యోగులు, ఉపాధ్యాయులు ఏపీ ప్రభుత్వం పై నిరసన చేయట్టారు.

ఈ నిరసనలో ముఖ్యమంత్రి సీఎం పై ఉపాధ్యాయులు, ఉద్యోగులు ఘోరంగా నే విరుచుకుపడ్డారు. ఉద్యోగులకు న్యాయం గా ఇవ్వాల్సింది ఇవ్వాలి. ఉద్యోగుల విషయంలో చంద్రబాబు ఎలా ఉన్నారో.. జగన్మోహన్ రెడ్డి ఎలా ఉంటున్నారో పోల్చుకోవడం తప్పుకాదు. కానీ ఉద్యోగులను విమర్శించడం చాలావరకు తప్పు. మంత్రులు ఎమ్మెల్యేల స్థాయిలో సౌకర్యాలు ఏమి ఆశించడం లేదు కదా అని ఉద్యోగులు వాపొయ్యారు.

ఇలా పలు రంగాల్లో ఉద్యోగులకు ఉపాధ్యాయులకు న్యాయం జరగాలి అని గురువారం రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యోగులు చెప్పట్టిన నిరసన జగన్ ప్రభుత్వానికి కొంత వరకు నెగిటివ్ సెగ తగిలించింది. ఇక ప్రభుత్వానికి ప్రభుత్వ ఉద్యోగులకు జరిగే యుద్ధం ఇలా ఎక్కడి వరకుపోతుందో.. అసలు జగన్ ఇప్పటికైనా స్పందిస్తాడో లేదో చూడాలి. జగన్ ప్రభుత్వం ఓ మెట్టు దిగే వరకు ఉద్యోగులు, ఉపాధ్యాయులు వెనుకంజ వెయ్యరనే తెలుస్తుంది.

Exit mobile version