Site icon 123Nellore

అలా ఎవరు చేసినా రాజకీయ సన్యాసం తీసుకుంటా : మంత్రి కొడాలి

చంద్రబాబు నాయుడు శవాలమీద చిల్లర ఏరుకొనే ప్రయత్నం చేస్తున్నారని మంత్రి కొడాలి నాని ఫైర్ అయ్యారు. జంగారెడ్డిగూడెంలో వరుస మరణాలపై వస్తున్న కథనాలను నానీ ఖండించారు, అసెంబ్లీ సమావేశాల అనంతరం మీడియాతో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో జగన్ ను టచ్ చేసే మగాడెవరని ప్రశ్నించారు. టీడీపీ,జనసేన, కాంగ్రెస్, బీజేపీ ఏ పార్టీ అయినా జగన్ కు వ్యతిరేకంగా 160 సీట్లలో పోటీ చేయగల మగాడు రాష్ట్రంలో ఎవరని సవాల్ విసిరారు. 160 సీట్లలో సింగల్ గా పోటీ చేసి గెలిస్తే రాజకీయ సన్యాయం తీసుకుంటానని స్పష్టం చేశారు.

చెరి సగం సీట్లు పంచుకుని పోటీ చేయాలే తప్పా.. సొంతంగా అన్ని స్థానాల్లో పోటీ చేసే దమ్ము కేవలం వైఎస్సార్సీపీకే ఉందని అన్నారు. ఈ సందర్భంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌పై మంత్రి తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. పవన్ కళ్యాణ్ పార్టీ పెట్టింది చంద్రబాబు కోసమేనని అన్నారు. అన్ని పార్టీలు కలవాలని పవన్ కళ్యాణ్ చెబుతున్నారని.. అసలు ఆయనే టీడీపీలో చేరొచ్చు కదా అని ప్రశ్నించారు. పవన్ జనసేనను స్థాపించచిందే చంద్రబాబు కోసమని, పవన్ సీఎం అయ్యేది లేదు..చచ్చేది లేదన్నారు. ‘చంద్రబాబు ఎన్ని జన్మలు ఎత్తిన ప్రజలు నమ్మరు. తన భార్యను రోడ్డెక్కించి అధికారం రావాలని ప్రయత్నం చేస్తున్నాడు.

చంద్రబాబు తన భార్యను అవమానించారని అసెంబ్లీకి రావట్లేదు. మరీ నారా లోకేశ్ ఎందుకు వస్తున్నాడు..? అంటే నీ మాటలు నీ కొడుకే నమ్మట్లేదు. ఆనాడు చంద్రబాబు సీఎంగా ఉన్న కౌరవ సభలో అడుగుపెట్టనని మా నాయకుడు జగన్ మోహన్ రెడ్డి అన్నారు. మా నాయకుడి బాటలో నడిచి.. మేం 43 మంది శాసనసభ్యులం జగన్ ఆదేశాలతో అసెంబ్లీకి రాలేదు..’ అని మంత్రి కొడాలి అన్నారు. చంద్రబాబు మాటలు ఆయన పార్టీ నేతలే పట్టించుకోవట్లేదన్నారు.

Exit mobile version