Jagan: వైయస్ జగన్మోహన్ రెడ్డి ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టి దాదాపు నాలుగు సంవత్సరాలు గడుస్తున్నపటికీ.. రాష్టం ఆదాయ విషయంలో మాత్రం పూర్తిగా వెనుకబడి ఉందనే చెప్పవచ్చు. జగన్ నవరత్నాలు మిషన్ మొదటి ఏడాది మంచిగానే విజయవంతం చేసాడు కానీ క్రమంగా ప్రజలు ఆ నవరత్నాల కోసం బిక్కు బిక్కు మంటూ..ఎదురుచూడాల్సిన పరిస్థితి వచ్చింది.
ఇదే క్రమంలో ఏపీ సీఎం జగన్ ఉద్యోగుల విషయంలో తప్పు చేసినట్లు తెలుస్తుంది. ప్రజల కోసం అదనంగా ఉద్యోగ అవకాశాలు కల్పించక పోయినా మంచిదే కానీ.. చేతిలో ఉన్నది కూడా లాక్కుంటే ఎవరు ఊరుకుంటారు. ఇప్పుడు జగన్ ప్రభుత్వం అక్షరాల చేస్తుంది అదే ఉద్యోగ సంఘాల నేతలను అనవసరంగా తట్టి లేపింది.
క్రమంగా హెచ్ఆర్ఏ శ్లాబులన్నింటినీ మార్చి వేసింది. ప్రతిశ్లాబూ ఉద్యోగులకు ఏపీ ప్రభుత్వం దాదాపు నష్టాన్నే కనబరిచింది. ఇదే తరుణంలో సీసీఎ కూడా రద్దు చేసింది. ఎప్పటి నుంచి రాష్ట్రస్థాయి పి ఆర్ సి కాకుండా కేంద్ర ప్రభుత్వం పద్ధతిలో జీతం చెల్లిస్తామని చెప్పింది. ఐదు సంవత్సరాలకు ఒకసారి వేసే భత్యాన్ని పి ఆర్ సి అంటారు.
ఇదంతా చూస్తుంటే ప్రభుత్వం పూర్తిగా ఉద్యోగులకు వ్యతిరేకంగా ఉన్నట్లు తెలుస్తుంది. ఎక్కడ ఉన్నతాధికారులు తప్పు చేస్తున్నారా.. లేక రాష్ట్ర ముఖ్యమంత్రి తప్పు చేస్తుందా అన్నది పక్కన పెడితే.. తప్పు ఎవరు చేసినా బాధ్యత వహించాల్సిన మాత్రం జగనే..కావున ఏపీ ప్రభుత్వ పరిస్థితి ఇలాగే ఉంటే నష్టపోయేది జగనే కాబట్టి ఇప్పటికైనా జగన్ ఈ విషయాన్ని చక్కదిద్దుకోవడం మంచిది.