Site icon 123Nellore

తల్లిని గెలిపించుకోలేని జగన్ ఏ చీర కట్టుకోవాలి?  : వంగలపూడి అనిత

అభంశుభం తెలియని ఆడబిడ్డలు బలైపోతున్నా.. తాడేపల్లి కొంపదాటి బయటకురాలేని మీ నాయకుడు మీరు.. మహిళాసాధికారత గురించి మాట్లాడటం సిగ్గుచేటమ్మా..రోజమ్మా అంటూ తెలుగు మహిళా అధ్యక్షురాలు వంగలపూడి అనిత అన్నారు. టీడీపీ కేంద్ర కార్యాలయంలో గురువారం మీడియాతో మాట్లాడారు. అనూష, రమ్య, తేజస్విని, వరలక్ష్మి, నాగమ్మ, ఈరోజు తెనాలిలో బలైన వివాహితలు బలవ్వడానికి మీ ముఖ్యమంత్రి కారణం కాదా? అని ప్రశ్నించారు. లోకేశ్ గెలిచినా ఓడినా ప్రజల్లోనే ఉంటున్నారని, మీ నాయకుడిలా ఇల్లుదాటి బయటకురాకుండా, పోలీస్ పహారా లేకుండా బయటకురాలేని దుస్థితిలో ఉన్నారని మండిపడ్డారు. లోకేశ్ ఓడిపోయాడంటున్న రోజా ఓడిపోలేదా అని గుర్తు చేశారు.

తల్లిని విశాఖపట్నంలో గెలిపించుకోలేని మీ నాయకుడు ఏ రంగు చీరకట్టుకోవాలో చెప్పమ్మా…రోజమ్మా అంటూ ఎద్దేవా చేశారు. మహిళా సాధికారతంటే కచ్చాబాదం డాన్స్ లేస్తూ,  జబర్తస్ట్ షో కోసం నవ్వురాకపోయినా..పడిపడినవ్వుతూ రెమ్యునరేషన్ తీసుకోవడం కాదని అన్నారు. మేం ఊరికో ఉన్మాది అంటే ఉలిక్కిపడుతున్నారెందుకని, టీడీపీ పుస్తకం విడుదల చేశాకే మీలోచలనం వచ్చిందన్నారు.  ఊరికో ఉన్మాది ఉన్నాడని తాము, తమపార్టీ నిరూపిస్తుంది.. మీరు అందుకు సిద్ధమా అని పేర్కొన్నారు.  గుంటూరులో బాలికను నిర్బంధించి రోజుల తరబడి అత్యాచారం చేసింది మీపార్టీ ఉన్మాదులు కాదా అని ప్రశ్నించారు.

మంత్రి పదవిలో ఉండి.. నువ్వేం మాట్లాడుతున్నావో తెలుసుకోవాలని,. ఎక్కడపడితే అక్కడ బూతులతో చంద్రబాబు, లోకేశ్ ను దూషిస్తున్నది మీరు, మీపార్టీ పేటీఎం కుక్కలు కాదా అని విమర్శించారు.  డ్వాక్రా అక్కచెల్లెమ్మలు దాచుకున్న పొదుపుసొమ్ము రూ.2వేలను కొట్టేసిన దిక్కుమాలిన ప్రభుత్వం వైసీపీ అని వివరించారు. జగన్, భారతి గురించి మాట్లాడితే ఊరుకోవా.. ఆడబిడ్డలను కాపాడలేని అసమర్థుడి గురించి మళ్లీమళ్లీ మాట్లాడతాం. సాటి ఆడబిడ్డగా మహిళలపై జరిగే దారుణాలపై స్పందించలేని ఆయన సతీమణి గురించి మాట్లాడతామని తీవ్రస్థాయిలో మండిపడ్డారు.

Exit mobile version