Site icon 123Nellore

మనిషి మరణానికి దగ్గరగా ఉన్నప్పుడు ఏం చేయాలో తెలుసా?

Life: ఈ లోకంలో చావుపుట్టుకలు అనేవి రెండు శాశ్వతం కావు. పుట్టిన ప్రతివాడు ఏదో ఒకరోజు మరణించక తప్పదు. అలా మరణానికి దగ్గరగా ఉన్న వారిలో అనేక ప్రశ్నలు తలెత్తుతాయి. ఇక ఇదే క్రమంలో మనిషి మరణానికి దగ్గరగా ఉన్నప్పుడు. ఏం చేయాలో పురాణాలు చెబుతున్నాయి. వాటి గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం.

భాగవతంలో శుక మహర్షిని పరీక్షిత్తు మరణం పురుషులు చేయదగినది ఏది అని ప్రశ్నించాడు. పరీక్షిత్తు మరణం సంభవించే సమయాన్ని గ్రహించకున్నాడు. 7 రోజుల్లో భాగవతం వినాలాట. ఇక ఆయన ఆ పని మీదే ఉన్నాడట. ఇక పరీక్షిత్తు మరణానికి దగ్గరగా ఉన్నప్పుడు ఆ ప్రశ్నకు శుక మహర్షి అసలు మొహమాటం లేకుండా సమాధానం చెప్పాడు.

మనిషి మరణానికి దగ్గరగా ఉన్నప్పుడు. భయాన్ని వీడి మమకారాన్ని తెంచుకోవాలి. మనసులో ఎలాంటి ఆలోచనలు ఉన్నా పట్టించుకోకుండా ఉండాలి. మనసు నిమగ్నం చేసుకొని ఎప్పుడూ భగవంతుడిని స్మరించుకోవాలి. జీవన గమన రీతులు ఇలాంటివన్నీ సంపూర్ణ రూపం తో నిలిచి ప్రశాంతంగా జపం చేయాలి.

ఎటువంటి ఆలోచనలు చింతలను పట్టించుకోకూడదు. అలా ఉండాలి అంటే మనసుకు సాధన తప్పనిసరిగా ఉండాలి. ఆ సాధన కేవలం ఒక కోవలోనే చేస్తే చాలదు. నిరంతరమైన ప్రక్రియగా మారాలి. ఎప్పుడూ నిశత్తువ లేని మనసుతో ఉండాలి. అలాంటి స్థితిలో ఉన్న వారికి వేరే విషయాల పట్ల ఏమాత్రం ఆసక్తి ఉండదు. ఇలా పలు జాగ్రత్తలు గురించి శుక మహర్షి బోధించాడు.

Exit mobile version