Site icon 123Nellore

సీఎం జగన్ లండన్ ల్యాండింగ్ మిస్టరీ ఏమిటి..? : యనమల

సీఎం జగన్మోహన్ రెడ్డి లండన్ ల్యాండింగ్ వెనుక మిస్టరీ ఏమిటి..? 3ఏళ్ల తర్వాత దావోస్ వెళ్లడం రాష్ట్రం కోసమా, తన కోసమా..? అక్రమార్జన నల్లధనం తరలింపు కోసమా..? అని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు యనమల రామకృష్ణుడు ఆరోపించారు. ఈమేరకు ఓ ప్రకటన విడుదల చేశారు. ‘‘దండుకున్న సంపద దాచుకోడానికే లండన్ లో ల్యాండింగా అనే అనుమానం ప్రజల్లో ప్రబలంగా ఉంది. అధికారికంగానే జగన్ లండన్ వెళ్లవచ్చు కదా..? చాటుమాటుగా వెళ్లాల్సిన అవసరం ఏమిటి..? అధికారులను వదిలేసి లండన్ ముగ్గురే(భార్య, మరొకరు) వెళ్లడం లోగుట్టు ఏమిటి..? మీ సొంత పనులకు, సీక్రెట్ పనులకు ప్రజాధనం దుర్వినియోగం చేస్తారా..?  ఏ దేశ పర్యటనకు సిబిఐ కోర్టును అనుమతి కోరారు..ఏ దేశానికి వెళ్లేందుకు కోర్టు అనుమతిచ్చింది..?

లండన్ వెళ్లేందుకు సిబిఐ కోర్టు అనుమతి ఉందా..? దావోస్ కు వెళ్లడానికి మాత్రమే అనుమతించిందా..? 14కేసులలో ముద్దాయిగా వున్న ఏ1 నిందితుడైన చరిత్ర జగన్ ది. ఆయన గత చరిత్ర దృష్ట్యా ప్రజల్లో మరిన్ని అనుమానాలు రేకెత్తడం సహజమే. ఏ దేశం వెళ్లడానికి మీరు దరఖాస్తు చేశారు..? మీకు ఏ దేశానికి అనుమతి ఇచ్చారు, మీరు ఏ దేశానికి వెళ్లారు..? లండన్ కు అనుమతిస్తే అధికార పర్యటనలో ఎందుకు చేర్చలేదు..? షెడ్యూల్ లో లేని లండన్ లో ఎందుకు ల్యాండ్ అయ్యారు..?

అనుమతి ఇవ్వకపోయినా లండన్ వెళ్లడం కోర్టు ధిక్కరణ కాదా..? దావోస్ కు అధికార యంత్రాగానిదో దారి, ముఖ్యమంత్రి దంపతులదో దారా..? స్పెషల్ ఫ్లైట్ కు ఒక ఖర్చు, కమర్షియల్ ఫ్లైట్ కు మరో ఖర్చా..? అందరూ కలిసివెళ్లకుండా సిఎం సెపరేట్ గా వెళ్లడం వెనుక మర్మం ఏమిటి..? అసలే ఆర్ధిక సంక్షోభంలో ఉన్న రాష్ట్రంపై, ప్రజలపై ఇది అదనపు భారం కాదా..? విలువైన ప్రజాధనం దుర్వినియోగం చేసే హక్కు మీకెక్కడిది..?’’ అని ప్రశ్నల వర్షం కురిపించారు.

Exit mobile version