బీట్‌రూట్ అంటే పెద్దగా ఎవరికీ ఇష్టం ఉండదు. తియ్యగా, వగరుగా ఉండే ఈ దుంపను పచ్చిగా తినేందుకు, జ్యూస్ తాగేందుకు కూడా ఆలోచిస్తారు. కానీ బీట్‌రూట్ వల్ల ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయో తెలుసుకుంటే అసలు తినకుండా ఉండలేరు. బీట్ రూట్ లో మనిషికి కావాల్సిన చాలా పోషకాలుంటాయి. శక్తినిచ్చే శాకందుంపల్లో బీట్‌రూట్‌ది ప్రత్యేక స్థానం. ఇది కనులకు ఇంపుగా కనిపించడమే కాదు. ఆరోగ్యానికి ఎంతో మంచిది కూడా ఎంతో మంచిది. బీట్ రూట్ జ్యూస్ లో కొవ్వు మరియు కెలరీలు అతి తక్కువగా ఉంటాయి. ప్రతి రోజు 200 నుండి 250 మిల్లీలీటర్ల బీట్ రూట్ జ్యూస్ తీసుకోవడం వల్ల శరీరానికి కావాల్సిన పోషక విలువలు అందుతాయి.
ఉదయాన్నే తాగడానికి బీట్ రూట్ జ్యూస్ ఎంతో అనువైనది. రక్తహీనతతో బాధపడేవారు బీట్ రూట్ ను ఉపయోగిస్తే చాలా మంచిది. అయితే బీట్‌రూట్‌ను తినడం ఇష్టం లేని వారు, కనీసం దాని జ్యూస్‌ను ప్రతి రోజు ఉదయాన్నే పరగడుపునే తాగాలి. దీని వల్ల ఎన్నో ప్రయోజనాలున్నాయని అంటున్నారు ఆరోగ్య నిపుణులు. ఎనీమియాతో బాధపడేవారు రోజూ ఒక గ్లాస్ బీట్‌రూట్ రసం తాగితే త్వరగా కోలుకుంటారు. బీట్ రూట్ జ్యూస్ రోజూ తాగితే ఐరన్ పెరుగుతుంది. అలాగే బ్లడ్ లో హిమోగ్లోబిన్ స్థాయి కూడా పెరుగుతుంది. చాలా మంది నీరసంతో ఇబ్బందిపడుతుంటారు.
అలాంటి వారు కొన్ని బీట్ రూమ్ ముక్కలు తిన్నా లేదంటే బీట్ రూట్ జ్యూస్ తాగినా సరిపోతుంది. దీంతో నీరసం పోయి ఫుల్ ఎనర్జీ వస్తుంది. బీట్‌రూట్ లో విటమిన్ ‘ఎ’, ‘సి’, ‘ఇ’లతో పాటు ఐరన్, క్యాల్షియం పుష్కలంగా ఉంటాయి. ఇవి రోగనిరోధక శక్తిని పెంపొందించడంలో కీలకపాత్ర పోషిస్తాయి. ఇక ఈ జ్యూస్‌లలో కొంచెం పసుపు, అల్లం లాంటివి జత చేయడం ద్వారా జలుబు, దగ్గు వంటి వాటికి కూడా చెక్ పెట్టవచ్చు. మధుమేహంతో బాధపడుతున్న వాళ్లు కూడా ఈ జ్యూస్‌ని కొద్ది మొత్తంలో తీసుకోవచ్చు.