ఓ పెళ్లి రిసెప్షన్ కు వచ్చిన కొందరు ఒకరిని ఒకరు తెగ కొట్టుకున్నారు. కాళ్లతో తన్నుకున్నారు. సినిమా లెవల్లో ఫైట్ సీన్స్ చూపించారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతుంది. ఇంతకీ వారు ఎందుకు కొట్టుకున్నారు. దాని వెనుక ఉండే కారణం ఏంటి? అసలు గొడవ ఎక్కడ స్టార్ట్ అయ్యింది. ఎంత మంది గాయపడ్డారు అనేది ఓ సారి తెలుసుకుందాం.
పెళ్లి అంటే నూరేళ్ల పంట. ఇద్దరు వ్యక్తుల మాత్రమే కాకుండా రెండు కుటుంబాలు ఏకం అయ్యే సుమధుర ఘట్టం. అందుకే పెళ్లి వేడుకకు మన అని అనుకున్న వారిని అందరినీ పిలుస్తారు. వారు వచ్చి వధూవరులకు మంచి జరుగుతుందని భావిస్తారు. అందుకే దీనిని ఇంత ఘనంగా చేస్తారు. అయితే కొంత మంది పెళ్లికి రాలేకపోవచ్చు. అందుకనే వారికోసం ప్రత్యేకంగా రిసెప్షన్ ఏర్పాటు చేస్తారు. ఇది ఇప్పుడు చాలా ఫ్యాషన్ గా మారింది. ఈ రిసెప్షన్ లో వెజ్, నాన్ వెజ్ ఐటమ్స్ కూడా పెట్టి.. వచ్చిన వారిని తృప్తిగా పంపిస్తారు.
ఇలాంటి రిసెప్షన్ ను ఏర్పాటు చేశారు పెళ్లి వాళ్లు. ఇందుకు చాలా మందే హాజరయ్యారు. అయితే ఉన్నట్టుండి ఏం జరిగిందో తెలియదు కానీ.. ఒకరిని ఒకరు కొట్టుకోవడం స్టార్ట్ చేశారు. సినిమా స్టైల్ లో దారుణంగా ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. ముందు వెనుక అని చూడకుండా పిడిగుద్దులు కురిపించారు. ఈ ఫైట్ లో ఓ వ్యక్తి గాయాలయ్యాయి. అయితే ఇక్కడ ట్విస్ట్ ఏంటి అంటే వాళ్లు ఎందుకు కొట్టుకున్నారు అనేది వాళ్లకే తెలియదు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది.