గల్లీ నుండి ఢిల్లీ వరకూ పనికిమాలినోడని తేలిపోయిన తరువాత ఫ్రస్టేషన్ కాకపోతే ఫన్ వస్తుందంటూ టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఎద్దేవా చేశారు. వెంట్రుక మహరాజ్.. ఈకల ఎంపరర్ జగన్ రెడ్డి గారూ మీ వెంట్రుకలు పీకే ఓపిక, తీరిక మాకు లేవు అంటూ వ్యాఖ్యానించిరు. నంద్యాల సభలో చంద్రబాబు నా వెంట్రుక కూడా పేకలేడన్న జగన్ వ్యాఖ్యలకు లోకేష్ కౌంటర్ ఇచ్చారు. మీ నవరంధ్ర పాలన నుంచి ప్రజలను ఎలా గట్టెక్కించాలనే ఆలోచనలతో మేము పనిచేస్తున్నామని సమాధానం ఇచ్చారు.
ప్రజలే మీ వెంట్రుకలు పీకడానికి, గుండు కొట్టించి పిండి బొట్లు పెట్టడానికి సిద్దంగా ఉన్నారని మండి పడ్డారు. అయినా నా మాట విని మీరే గుండు కొట్టించేసుకోండి .. మీ వెంట్రుక ఎవడు పీకుతాడో చూద్దాం అంటూ వెటకారం చేశారు. అంతక ముందు యూజీసీ ఛైర్మన్, కేంద్ర ఉన్నతవిద్య కార్యదర్శికి లోకేశ్ లేఖ రాశారు. రాజకీయ అవసరాల కోసం రాష్ట్రంలో యూనివర్సిటీలను దుర్వినియోగం చేస్తున్నారని లేఖలో పేర్కొన్నారు.
యూనివర్సిటీల్లో వైసీపీ కార్యకర్తలకు ప్రైవేటు ఉద్యోగాలంటూ జాబ్‍మేళా ప్రకటించడం రాజ్యాంగ విరుద్ధమన్నారు. యూనివర్సిటీల్లోనే రాజకీయ జాబ్‍మేళాల నిర్వహణకు ఏర్పాట్లు చేస్తున్నారని, ఏప్రిల్1న ఏయూ, ఎస్‍వీయూ, ఏఎన్‍యూలలో జాబ్‍మేళా అంటూ వైసీపీ ఎంపీ ప్రకటించారని గుర్తు చేశారు. వైసీపీ గెలుపునకు కృషిచేసిన వారికే ఈ జాబ్ మేళాలంటూ ప్రకటన చేశారని, వైఎస్‍ఆర్‍సీపీ జాబ్‍మేళా పేరిట వెబ్‍సైట్‍నూ తెచ్చారని, ఈ ఘటనలపై తగు చర్యలు తీసుకోవాలని లేఖలో లోకేష్ కోరారు.