Site icon 123Nellore

సీఎం అభ్యర్థిపై జనసేన-బీజేపీ మధ్య మాటల యుద్ధం..

బీజేపీ-జనసేన ఉమ్మడి సీఎం అభ్యర్థిపై రెండు పార్టీల మధ్య వార్ నడుస్తోంది. ఇటీవల పవన్ కళ్యాణ్ మూడు ఆప్షన్లు ప్రకటించిన తర్వాత సీఎం కుర్చీ అంశం హాట్ హాట్ గా నడుస్తోంది. మంగళవారం రాష్ట్రంలో నడ్డా పర్యటనతో ఈ విషయం మరింత వేడెక్కింది. పవన్ వ్యాఖ్యలకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు పరోక్ష వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో ఎవరినో సీఎంను చేసేందుకు బీజేపీ లేదని, దేశంలో ఎవరినో ప్రధానిని చేసేందుకు బీజేపీ లేదని స్పష్టం చేశారు. వనరులు ఉన్నా రాజధాని లేని రాష్ట్రంగా ఏపీ ఉందని, వైసీపీ నేతల అవినీతితో అప్పుల రాష్ట్రంగా మారిందన్నారు.

ఏపీకి మెడికల్ కాలేజీలు రాబోతున్నాయని, వైద్య, విద్య కోసం ఎవరూ ఉక్రెయిన్ వెళ్లాల్సిన అవసరం లేదని, దాదాపు మూడు వేల సీట్లు అందుబాటులోకి వస్తాయని తెలిపారు. జాతీయ అధికార ప్రతినిధి సత్యకుమార్ మాట్లాడుతూ.. జేపీయేతర వ్యక్తిని సీఎంగా చేసిన సంస్కృతి బీజేపీలో లేదని సంచలన వ్యాఖ్యలు చేశారు. పొత్తులు, సీఎం అభ్యర్థిపై ఇప్పుడు ప్రస్తావన అనవసరం లేదని, గతంలో జగన్ ట్రాప్లోల చంద్రబాబు పడ్డారని, ఇప్పుడు పవన్ పడ్డారని తెలిపారు.

రాష్ట్రంలో సమస్యలు పక్కదారి పట్టించేందుకు వైసీపీ పొత్తుల గురించి చర్చపెడుతోందని మండిపడ్డారు. బీజేపీ వ్యాఖ్యలు ఇలా ఉండగా సీఎం అభ్యర్థిగా పవన్నుు బీజేపీ అంగీకరించకపోతే మాకు రెండు ఆప్షన్లు ఉన్నాయన్నారు. టీడీపీ కూడా పవన్ను్ సీఎం అభ్యర్థిగా అంగీకరిస్తేనే పొత్తఅని, ఎవరినో సీఎం చేయడానికి జనసేన లేదని తేల్చి చెప్పారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం పవన్ సీఎం కావాలని జనసేన నేతలు అంటున్నారు. దీనిపై పవన్ కళ్యాణ్ ఏం స్పందిస్తారో, నేటి బీజేపీ కోర్ కమిటీలో ఏం చర్చిస్తారో చూడాలి.

Exit mobile version