ఆంధ్రప్రదేశ్‌లో సినిమా థియేటర్‌పై రెవెన్యూ అధికారులు దాడులు చేస్తూనే ఉన్నారు. ఇప్పటికే పలు థియేటర్లకు నోటీసులు జారీ చేశారు. చిత్తూరులో మరికొన్నింటిని మూసేయాలని ఆదేశాలు కూడా జారీ చేశారు. మరోవైపు అనంతపురంలో థియేటర్ ఓనర్లు స్వచ్చందంగా థియేటర్లు మూసేయడం గమనార్హం.
ఏపీలో ప్రభుత్వ నిబంధనలను పాటించని థియేటర్లపై రెవెన్యూ కొరడా ఝులిపించారు. చిత్తూరులో 11 థియేటర్లను సీజ్ చేయగా.. మదనపల్లెలో 37 హాళ్లకు నోటీసులు జారీ చేశారు. వీటిల్లో ఇప్పటికే16 సినిమా థియేటర్లు మూసేశారు. మదనపల్లిలో ఏడు, కుప్పంలో నాలుగు సినిమా థియేర్లు మూసేయాలని ఆదేశాలు చెశారు. ఇక అనంతపురంలో అయితే, థియేటర్ల ఓనర్లే స్వచ్చందంగా మూసేస్తూ ముదుకొచ్చారు. పెనుగొండలో 3, గోరెడ్లలో ఓ థియేటర్‌ను ఓనర్లే స్వచ్చందంగా మూసేశారు.
మరోవైపు అనంతపురంలో జాయింట్ కలెక్టర్ నిశాంత్ కుమార్ సినిమా థియేటర్లను తనిఖీ చేశారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం తినుబండారాలు, టికెట్ విక్రయాలు చేయాలని సూచించారు. థియేేటర్లలో ప్రేక్షకుల సౌకర్యార్థం అన్ని సౌకర్యాలు ఉన్నాయా లేవా అని ఆరా తీశారు. పాత రికార్డులను కూడా తీసి పరిశీలించారు. ఈ క్రమంలోనే ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తే చట్టపరమైన చర్యలు తప్పని థియేటర్ నిర్వహకులకు వార్నింగ్ ఇచ్చారు.