వివేకానందరెడ్డి హత్య కేసులో ఆయన చిన బావమరిది, అల్లుడు నర్రెడ్డి రాజశేఖర్ రెడ్డి, పెదబావమరిది శివప్రకాశ్ రెడ్డి, టీడీపీ ఎమ్మెల్సీ బీటెక్ రవిలతో పాటు మరో ముగ్గురిని కూడా నిందితులుగా చేర్చి విచారించాలని పులివెందుల కోర్టులో దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి భార్య తులసమ్మ పిటిషన్ వేశారు. వివేకానందరెడ్డి రెండో వివాహం చేసుకోవడంతో ఆయన కుటుంబంలో వివాదాలు తలెత్తాయని, రాజకకీయ ప్రత్యర్థులు ఈ హత్యకు కారణమని అందులో పేర్కొన్నారు. సీబీఐ ఉద్దేశపూర్వకంగానే ఆ విషయాలను పట్టించుకోకుండా కేసును తప్పుదారి పట్టిస్తున్నారని ఆరోపించారు. ఈనెల21న వేసిన పిటిషన్ విషయం ఇప్పుడు బటయకు వచ్చింది. ఈపిటిషన్ లో తులసమ్మ కొన్ని అంశాలను ప్రస్తావించింది.
షేక్.షమీన్ అనే మహిళను వివేకానందరెడ్డి 2010లో రెండో పెళ్లి చేసుకున్నారని, వారికి 2015లో కుమారుడు జన్మించారని వివరించారు. సౌభాగ్యమ్మ కొన్నేళ్లుగా హైదరాబాద్ లో కుమార్తెతో ఉంటున్నారని, వివేకా ఒక్కరే పులివెందుల్లో ఉండేవారని తెలిపింది. రెండో భార్య షమీన్, ఆమె కుమారుడికి కొంత ఆస్తి రాసివ్వాలని వివేకానంద అనుకోగా ఆయన కుటుంబం తీవ్రంగా వ్యతిరేకంచిందని, షమీన్ కుమారుడిని తన వారసుడిగా ప్రకస్తామని చెప్పడంతో కుటుంబ సభ్యులు ఆందోళనకు దిగారని పేర్కొంది.
వివేకా చనిపోయిన విషయాన్ని పీఏ కృష్ణారెడ్డి మెదట ఆయన కుటుంబ సభ్యులకే తెలిపారని, వివేకా రాసినట్లు చెబుతున్న లేఖ, సెల్ ఫోన్ ను స్వాధీనం చేసుకున్నారని, మెస్సేజ్ లు, ఇతర వివరాలను డిలీట్ చేసిన తర్వాతే సాయంత్రం సెలఫోన్, లేఖలను పోలీసులకు అప్పగించారని విరించారు.వివేకా ఆయన అనుచరుడు కొమ్మా పరమేశ్వరరెడ్డికి మధ్య బెంగళూరులోని ఓ భూమి సెటిల్ మెంట్ వ్యవహారంలో విబేధాలు తలెత్తాయని తులసమ్మ కోర్టులో వేసిన పిటిషన్ లో పొందుపరిచారు.