మెక్ డోనాల్డ్స్ లో పని చేసే ఓ 19 ఏళ్ల కుర్రాడు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాడు. ఉత్తరాఖండ్ లోని పల్మోరా కు చెందిన ఈ కుర్రాడు ఆర్మీలో చేరాలనే లక్ష్యం కోసం రోజూ పది కిమీ మేర రోడ్డుపై పరుగులు పెడుతున్నాడు. ఇతను పరుగులు పెట్టడాన్ని వీడియో తీసిన ఓ వ్యక్తి దానిని సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. దీంతో కుర్రాడు వైరల్ అయ్యాడు. ఇంత కీ ఆ వీడియోలో ఏం ఉంది.
ప్రదీప్ మెహ్రా వయసు 19 ఏళ్లు. వయసు చిన్నదే అయినా.. ఆయన ఆలోచనలు చాలా పెద్దవి. దేశానికి సేవ చేయాలి అనే ఆలోచనలు కలవాడు. బాధ్యతలు కూడా బాగా తెలిసినవాడు. దీంతో నోయిడాలోని సెక్టార్ 16 లో ఉండే మెక్ డొనాల్డ్స్ లో పని చేస్తున్నాడు. ఉదయం వస్తే.. మిడ్ నైట్ వరకు డ్యూటీలోనే ఉంటాడు. ఇలా పని పూర్తి అయిన తరువాత సుమారు పది కీమీ పరుగులు పెట్టి ఇంటికి వెళ్తాడు. ఇంటికి పోయిన తరువాత రెస్ట్ తీసుకుంటారా అనుకుంటే పొరపాటే… తన సోదరుడు నైట్ షిప్ట్ కు పోయేందుకు అన్నీ సిద్దం చేసి ఇస్తాడు. అన్నం వండుకుని తిని సోదరునికి పెట్టి పంపిస్తాడు. అంతేగాకుండా తన తల్లి కూడా అనారోగ్యంతో బాధ పడుతుందని చెప్పాడు.
ఇలా రోజు పరుగులు పెడుతూ వెళ్లే ఈ కుర్రాడిని ఓ నిర్మాత చూశాడు. ఆయన ఎందుకు ఇంత రాత్రి వేళ పరిగెడుతున్నావ్ అని అడిగాడు. దీనికి ఆయన సమాధానంగా నేను రన్నింగ్ చేస్తున్నాను. ఆర్మీకి సెలెక్ట్ అవ్వాలి అని సమాధానం ఇచ్చాడు. నేను కార్లో దిగబెడుతాను అంటే వద్దు అని నిరాకరించాడు. నా ప్రాక్టిస్ పోతుంది అని చెప్పాడు. ఇలా చాలా విషయాలు చెప్పాడు. ఈ కుర్రాడి పట్టుదల చూసి ముచ్చటచెందిన ఆ నిర్మాత సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. దీంతో ఆ కుర్రాడు వైరల్ అవుతున్నాడు.