Site icon 123Nellore

కోతికి అంత్యక్రియలు నిర్వహించిన గ్రామస్థులు.. భారీగా..!

చనిపోయిన ఓ మూగ జీవి కోసం ఓ ఊరంతా కదిలి వచ్చింది. గ్రామంలో ఉన్న ఓ వ్యక్తి చనిపోతే ఎలా అయితే మనుషులు వస్తారో అలా చాలా మంది ప్రజలు వచ్చారు. అప్పటి వరుకు గ్రామంలో వారి మధ్య తిరుగాడిన జంతువు చనిపోయే సరికి ఈ విషయాన్ని జీర్ణించుకోలేక పోయారు. దానికి అనారోగ్యం చేస్తే గ్రామస్తులు చాలా మంది సరిగ్గా అన్నం కూడా తినలేదు. అంతగా వారు అభిమానించి. ప్రేమించన జంతువు ఏంటి అనేది చాలా మంది డౌట్​ రావచ్చు. ఇంతకీ అది ఏంటి అంటే… కోతి.

VILLAGERS CONDUCT FUNERAL FOR DEAD MONKEY IN RATLAM DISTRICT OF MADHYA PRADESH

అవును మీరు చదివింది నిజమే. ఓ కోతి కోసం మధ్యప్రదేశ్‌ లోని రత్లాం జిల్లా లో ఉండే దలోపురా గ్రామంలో ఉండే ప్రజలు ఇదంతా చేశారు. చనిపోయిన ఈ కోతికి ఏకంగా కర్మకాండలు నిర్వహించారు. ఆ కోతి ఈనెల 24వ తేదిన ఆనారోగ్యంతో బాధపడింది. అనంతరం కొద్ది రోజులు గడిచాక చనిపోయింది. అది రోజులుగా గ్రామంలో ఉండే వారితో సరదాగా ఉండేది. దీంతో దానికి వారంత చనిపోయింది కదా అని పారేయకుండా పెద్ద ఎత్తునా భారీ బ్యాండ్​ మేళంతో అంత్య క్రియలు నిర్వహించారు.

ఆ ఊరికి గ్రామపెద్ద అయిన గోపాల్‌దాస్‌ మహరాజ్‌ ఆ కోతి అంతిమ సంస్కారాలను కట్టుబట్లతో ముందుండి చేయించారు. చివరకు గ్రామం చివర ఉన్న ఓ శ్మశాన వాటికలో దానిని పూడ్చి పెట్టారు. పద్దతిగా పూల మాలలతో, తెల్లటి వస్త్రాలతో ఈ కోతికి అంతిమ సంస్కారాలు అన్నీ అనుకున్న విధంగా నిర్వహించారు. ప్రస్తుతం ఈ వార్త ఓ రేంజ్​ లో వైరల్​ అవుతుంది.

Exit mobile version