వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణరాజు, వైసీపీ పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయిరెడ్డి ఒకరిపై ఒకరు తీవ్రమైన వ్యాఖ్యలతో దుమ్మెత్తి పోసుకుంటున్నారు. ఇద్దరి మధ్య ట్వీట్ల వార్ నడుస్తోంది. సాదా సీదా రాజకీయ ఆరోపణలు కాకుండా వ్యక్తి గతంగా దూషించుకుంటున్నారు. ఆ దూషనలు కాస్తు కులం పేరుతో, బాడీ షేమింగ్ చేసుకునే వరకు వెళ్లింది. ఇద్దరికి ఎక్కడ వచ్చింది..ఎప్పుడు వచ్చిందో చూద్దాం రండి.
విజయసాయిరెడ్డి తన ట్వీట్లో.. ‘‘డిల్లీలో కూర్చుని జోష్యాలు చెప్పే నర్సాపురం నక్కకి సిగ్గుంటే రాజీనామా చేసి గెలవాలి. నాలుగు పచ్చకుల చానెల్స్ మైకుల ముందు పెట్టుకుని మొరగడం కాదు. నియోజకవర్గంలో తిరిగితే విగ్గు రాజుకు దిమ్మ తిరుగి బొమ్మ కనిపిస్తుంది. బూజు లాంటి రాజు ఓ పెగ్గు రాజు..నీ పదవి నీ విగ్గులాంటిదే..తీసేస్తే మిగిలేది గుండే. అడగకుండానే నియోజకవర్గం వదిలి అజ్ణాతవాసం, అరణ్యవాసం చేసే ఏకైక రాజు విగ్గురాజు, పెగ్గురాజు’’ అని పెట్టగా.. కౌంటర్ గా రఘురామరాజు ‘‘హలో రసిక వానరా..అవును నాకు ఉన్నది విగ్గు..ఎన్ని తన్నులు తిన్నా నీకు లేనిది సిగ్గు. కొత్తగా రాజీనామా అంటున్నావు..నువ్వు నీ గ్యాంగ్ లీడర్ అనర్హత/సస్పెన్ పై చేతులు ఎత్తేశారా.? నేను ఏపీకి వస్తే ముఖ్యమంత్రికి దిమ్మతిరిగి మైండ్ బ్లాక్’’ అని రిప్లై ఇచ్చారు.
మళ్లీ విజయసాయిరెడ్డి కౌంటర్ ఇస్తూ..‘‘ఓరేయ్ డూప్లికేట్ గాజు..నీ మీసాలైనా ఒరిజనలేనా లేక పీకి అంటించుకున్నావా.? వాటిని మెలితిప్పడం ఎందుకురా.? ఎల్లో కుల మీడియా రుచి కమ్మగా..స్వంత పార్టీ రుచి చేదుగా…నీదేం నోరురా విగ్గుబాబు’’ అని స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. దీనిపై మళ్లీ రఘురామరాజు కౌంటర్ ఇస్తూ.. ‘‘అజ్ణాతవాసం తర్వాత పాండవులకి, అరణ్యవాసం తర్వాత శ్రీరాముడికి జరిగింది పట్టాభిషేకం. చచ్చింది కౌరవులు, దానవులు..తెలుసుకోరా కండోమ్ రెడ్డి’’ అని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఇవి ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.