Site icon 123Nellore

భాంగ్రా డాన్స్ చేసిన నవవధువు.. వైరల్ వీడియో!

Viral Video: జనవరి 20న ఇన్స్టా గ్రామ్ అకౌంట్ లో పోస్ట్ చేసిన ఒక వధువు వీడియో నెటిజన్ల ప్రశంసలను పొందుతోంది. ఆ వీడియో ప్రత్యేకత ఏమిటి అని అనుకుంటున్నారా! అందులో ఒక వధువు మోడ్రన్ సాంగ్ కు భాంగ్రా స్టెప్స్ వేసింది. ఈ డాన్స్ చూసిన నెటిజన్లు రకరకాలుగా కామెంట్లు ఇస్తున్నారు.

భాంగ్రా నృత్యం పంజాబ్ లోని మఝా ప్రాంతం నుంచి పుట్టింది. ఇది ఒక జానపద నృత్యం. పంట చేతికొచ్చిన సంతోషంలో ఆనందంగా పంజాబ్ ప్రజలు ఈ జానపద నృత్యాన్ని చేస్తారు. ఈ నృత్యంలో వేగంగా కదలడం, వంగడం, శరీరాన్ని హరివిల్లుల వంచడం, కాళ్ళు, చేతులు కలపడం ఇలా చాలా భంగిమలు ఉంటాయి.

ఒకేసారి ఎక్కువ మంది ఈ నృత్యాన్ని చేస్తారు. ఈ జానపద నృత్యం చూడడానికి ఎంతో చక్కగా ఉంటుంది. ప్రస్తుత కాలంలో జానపద నృత్యం చేసేవారి సంఖ్య తగ్గుతోంది. కానీ సౌత్ ఇండియాకు చెందిన వధువు భాంగ్రా నృత్యం చేసి అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. ఈమెతో పాటు మరికొందరు కూడా డాన్స్ వేశారు.

ఈమె పంజాబీ యువత కాదు సౌత్ ఇండియాకు చెందిన వధువు. ఈమె పేరు రాణి అర్వపల్లి. పంజాబీ యువత కాకపోయినా చాలా చక్కగా భాంగ్రా స్టెప్స్ వేసింది. ఈమె భాంగ్రా ఎంపైర్ అనే ఆర్ట్స్ అండ్ ఎంటర్‌టైన్‌మెంట్ సంస్థలో భాంగ్రా నేర్చుకుంది. రాణి వేసిన డాన్స్ వీడియోను ఆ సంస్థ తన ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ లో పోస్ట్ చేసింది.

 

లెహంగాలో అదిరిపోయే భాంగ్రా స్టెప్స్ ను వేసిన వధువును చూసి నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపించారు. కొందరు యూజర్స్ ఆమెను భాంగ్రా రాణి, సూపర్బ్ పెర్ఫార్మెన్స్, డాన్స్ చూడముచ్చటగా ఉందంటూ ఇలా అనేక కామెంట్స్ ఇస్తున్నారు. మొత్తానికి ఆమె చేసిన భాంగ్రా నృత్యం నెటిజన్లకు చాలా నచ్చింది.

Exit mobile version