Site icon 123Nellore

బ్యాంకు లాకర్ లో విలువైన శివలింగం.. దాని విలువ తెలిస్తే దిమ్మ తిరిగిపోవాల్సిందే!

సాధారణంగా మనం మన ఇంట్లో భద్రత లేని దృష్ట ఎంతో విలువైన ఆభరణాలను బ్యాంకు లాకర్లలో మనం భద్రపరచుకుంటాము.అయితే తాజాగా తమిళనాడులోని ఒక బ్యాంకు లాకర్ లో ఎంతో పురాతనమైన అత్యంత విలువైన మరకత శివలింగం దాచిపెట్టడం ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. వెయ్యి సంవత్సరాల చరిత్ర కలిగిన శివలింగం తంజావూరిలో బయటపడింది. దీంతో తమిళనాడు బ్యాంకు లాకర్ లో ఉన్న ఈ శివలింగాన్ని ఐడల్స్ స్మగ్లింగ్ నిరోధక అధికారులు స్వాధీనం చేసుకున్నారు. పూర్తి వివరాల్లోకి వెళితే…

తంజావూరులోని అరుళనంద నగర్ లో సామియపన్ అనే వ్యక్తి ఇంట్లో విలువైన శివలింగాలు ఉన్నట్లు పోలీసులకు సమాచారం రావడంతో పోలీసులు అతని ఇంటిలో సోదాలు నిర్వహించారు. ఈ క్రమంలోనే పోలీసులు ఎన్ఎస్ అరుణ్ అనే వ్యక్తిని ప్రశ్నించగా తన తండ్రి ఎన్ఏ సామియప్పన్ తంజావూరు లోని ఒక బ్యాంకు లాకర్లో శివలింగాన్ని భద్రపరచినట్లు పోలీసులకు తెలియజేశారు. అరుణ్ ఇచ్చిన సమాచారంతో పోలీసులు సదరు బ్యాంక్ ను సందర్శించి అందులో దాచి ఉన్న మరకత శివలింగం స్వాధీనం చేసుకున్నారు.

పోలీసులు స్వాధీనం చేసుకున్న ఈ శివలింగానికి సంబంధించి ఎలాంటి పత్రాలు లేకపోవడంతో పోలీసులు ఈ శివలింగం గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు బయట పెట్టారు. ఈ శివలింగం సుమారు 530 గ్రాముల బరువు ఉండటమే కాకుండా 8 సెంటీమీటర్ల పొడవు ఉన్నట్లు పోలీసులు తెలిపారు. ఈ శివ లింగాన్ని పరిశీలించిన జెమాలజిస్టులు ఈ శివలింగం విలువ దాదాపు 500 కోట్లు ఉంటుందని వెల్లడించారు. అయితే ఈ శివలింగం వారికి ఎక్కడ దొరికింది ఏమిటి అనే విషయాలను ఆరాతీయగా వారు తమకు ఏమీ తెలియదని సమాచారం చెప్పడంతో పోలీసులు సామియప్పన్ ను అదుపులోకి తీసుకొని విచారణ కొనసాగిస్తున్నారు.

Exit mobile version