మనం చాలా మంది అంపైర్ లను చూస్తాము. కానీ అందరూ ఒకేలా అంపైరింగ్ చేయరు. చాలా తక్కువ మంది తమ దైన శైలిలో చేస్తుంటారు. కానీ మనకు అందరూ గుర్తుకు ఉండరు. ఒకప్పుడు బిల్లీ బౌడెన్ అనే అంపైర్ వినూత్నంగా సిగ్నల్స్ ఇచ్చేవారు. ఆయన అంపైరింగ్ అనేది చాలా ఫేమస్ అయ్యింది. ఆయన చేసే అంపైరింగ్ చూసిన చాల మంది ఇలా కూడా చేయవచ్చా అని అనుకునే వారు. వాస్తవానికి ఇది చాలా కఠినమైన పని. ఎందుకంటే మ్యాచ్ ను మలుపు తిప్పే నిర్ణయాలు చాలా త్వరగా, కచ్చితత్వంగా తీసుకోవాల్సి ఉంటుంది. వైడ్, ఎల్బీడబ్ల్యూ, నోబాల్ ఇలా చాలా నిర్ణయాలు కచ్చితంగా ఉండాలి. అయితే కొన్ని సార్లు అంపైర్లు అనాలోచిత నిర్ణయాలతో వార్తల్లో నిలుస్తుంటారు.
కానీ కొందరు మాత్రం వారు చేేసే వినూత్న అంపైరింగ్ వల్ల వార్తల్లో నిలుస్తారు. ఇలా ఓ అంపర్ వార్తల్లో నిలవడంమే కాకుండా ప్రస్తుతం వైరల్ అవుతున్నారు. మహారాష్ట్ర లో ఇటీవల స్థానికంగా ఓ క్రికెట్ టోర్నమెంట్ జరిగింది. పురందర్ ప్రీమియర్ లీగ్ పేరుతో జరిగిన ఈ టోర్నీలో ఓ అంపైర్ ఇచ్చిన వైడ్ నిర్ణయం సోషల్ మీడియాలో వైరల్గా మారింది.
A different style of umpiring #Cricket pic.twitter.com/PZdbB2SUIY
— Saj Sadiq (@SajSadiqCricket) December 5, 2021
ఇందులో ఏముంది అని అనుకుంటున్నారా… అక్కడే ఉంది ట్విస్టు. ఆ అంపైర్ ఇచ్చిన సిగ్నల్ ఇంత వరకు ఏ అంపైర్ కూడా ఇవ్వలేదు. రెండు కాళ్లు పైకి ఎత్తి ఇచ్చారు. దీంతో ప్రేక్షకులు బాలును చూడడం మానేసి అంపైర్ ను చూస్తుండి పోయారు. దీంతో ఈ వీడియో ప్రస్తుతం వైరల్ గా మారింది.