Site icon 123Nellore

ఉమా.. ఆడో మగో చూపించుకుని సర్టిఫికెట్ తెచ్చుకో : అంబటి

దేవినేని ఉమా.. ఆడో మగో డాక్టర్ కు చూపించి సర్టిఫికెట్ తెచ్చుకో అంటూ నీటి పారుదల శాఖా మంత్రి అంబటి రాంబాబు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. దేవినేని ఉమా మహేశ్వరరావు అంబటి శనివారం కౌంటర్ ఇచ్చారు. ఐదేళ్లు ఇరిగేషన్ మంత్రిగా డబ్బు సంచులు మోయడం తప్ప ఇంకేమైనా చేశావా? మండిపడ్డారు. డయాఫ్రమ్ వాల్ పై పూర్తిగా క్లారిటీ వస్తేనే, పోలవరం ప్రాజెక్ట్ ఎప్పటికి పూర్తవుతుందో చెప్పగలమన్నారు. డయా ఫ్రమ్ వాల్ దెబ్బతినడానికి చంద్రబాబు ప్రభుత్వ చర్యలే కారణమని ఆరోపించారు. 2018కే పోలవరం పూర్తి చేసి ఎన్నికలకు వెళ్తాం అని చెప్పిన వాళ్లు పూర్తి చేశారా అని ప్రశ్నించారు.

దెబ్బతిన్న డయా ఫ్రమ్ వాల్ పనికొస్తుందా? కొత్తది కట్టాలా? అన్న విషయంలో నిపుణులు తర్జనభర్జన పడుతున్నారన్నారు. నిపుణుల నివేదిక రాగానే ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని పేర్కొన్నారు. స్పిల్ వే నిర్మించకుండా డయా ఫ్రమ్ వాల్ కట్టడం వల్లే ఇలాంటి దుస్థితి ఏర్పడిందన్నారు. కాఫర్ డ్యామ్ పనులు సగం ఉండగానే డయా ఫ్రమ్ వాల్ నిర్మించారని తెలిపారు. పోలవరం నిర్మాణం విషయంలో చంద్రబాబు ఎన్నో తప్పిదాలు చేశారని మండిపడ్డారు.

డయాఫ్రం వాల్ వద్ద పడిన గుంతలు పూడ్డాలంటే రూ.800 కోట్లు ఖర్చు అవుతుందని, నీరు తోడాలంటే రూ.2వేల కోట్లు ఖర్చవుతుందన్నారు. చంద్రబాబు తెలివిలేని నిర్ణయాల వల్లే రీ-డిజైన్ చెయ్యాల్సి వచ్చిందన్నారు. చంద్రబాబు చేసిన తప్పులకు మమల్ని బాధ్యులు చేస్తున్నారని మండిపడ్డారు. దేవినేని ఉమ, రామానాయుడు అపరమేధావుల్లా మాట్లాడుతున్నారని దుయ్యబట్టారు. వైసీప అధికారంలోకి వచ్చిన రోజే సీఎం జగన్, పోలవరం ప్రాజెక్ట్ పై విషం చిమ్మారని మండిపడ్డారు.

Exit mobile version