పవర్ కట్ అయితే కలిగే అసౌకర్యం చెప్పలేనిది. ఎలా అంటే ఫోన్ లో ఛార్జింగ్ కూడా కచ్చితంగా అదే సమయానికి అయిపోతుంది. ఇక ఇలాంటి వరస్ట్ సిట్యువేషన్ చాలా ఉంటాయి. ఓ ప్రాంతంలో తరుచుగా పవర్ కట్ అవుతోంది. కరెంట్ సప్లయి నిలిచిపోవడంతో అక్కడి వారు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇది భరించలేక ఓ వ్యక్తి ఎలక్ట్రిసిటీ బోర్డుకు ఫిర్యాదు చేశారు. తనకు కలిగిన అసౌకర్యాన్ని వివరిస్తూ అధికారులకు కంప్లైంట్ ఇచ్చారు. దీనిపై స్పందించిన సదరు అధికారులు పరిహారం అందించారు. అందులో ఓ క్రేజీ ట్విస్ట్ కూడా దాగి ఉంది.
ఇంగ్లాండ్ వెస్ట్ యార్క్ షైర్ లో నివసించే గారెత్ హ్యూస్… పవర్ కట్ పై అధికారులకు ఫిర్యాదు చేశారు. తాము నివసించే ప్రాంతంలో తరుచుగా పవర్ సప్లయి నిలిచిపోతోందని అధికారుల దృష్టికి తీసుకొచ్చారు. ఆ సమయంలో తనకు కలిగిన ఇబ్బందులను అధికారులకు తెలియజేశాడు. కాగా దీనిపై ఎలక్ట్రిసిటీ అధికారులు స్పందించారు. అతడికి పరిహారం కూడా ఇచ్చారు. ఎంతంటే 2.3 ట్రిలియన్ పౌండ్లు. ఆయన జీవితంలో ఎప్పుడూ సంపాదించలేనంత డబ్బులను అందించారు. దీనిపై గారత్ స్పందించారు.
నార్తర్న్ పవర్ గ్రిడ్ అధికారులు ఇంతపెద్ద మొత్తంలో పరిహారం ఇచ్చినందుకు గారత్ ధన్యవాదాలు తెలిపారు. అంతేకాకుండా నిజానికి పరిహారంగా ఇంత ఇస్తారా? అనే సందేహం వెలిబుచ్చారు. దీనిపై అధికారులు స్పందించారు. పొరపాటు జరిగిందని నాలుక కరుచుకున్నారు. కాగా ఆ చెక్కు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. కాగా నెటిజన్లు భిన్నంగా స్పందిస్తున్నారు. త్వరగా క్యాష్ తీసుకో బ్రద్ అంటూ కామెంట్ చేస్తున్నారు. వీలైనంత త్వరగా డబ్బులు డ్రా చేసుకో అంటూ సలహాలు ఇస్తున్నారు.