Site icon 123Nellore

ఆరోగ్యకరమైన, మెరిసే చర్మం కోసం ఇలా చేయండి..!

tips for healthy skin

చర్మ సంరక్షణ అనేది మన ఆరోగ్యానికి చాలా ముఖ్యం. ఆరోగ్యకరమైన, మృదువైన, తాజా, మెరిసే చర్మం అందరూ కావాలనుకుంటారు. మన శరీర జీవక్రియలలో చర్మం చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది.  శరీరానికి తగినంత ప్రోటీన్‌లు, విటమిన్లను అందించకపోతే.. చర్మం తాజాగా, యవ్వనంగా కనిపించదు. పీచుపదార్థాలు లేని ప్రాసెస్ చేసిన ఆహారాలను తీసుకుంటే చర్మం డల్‌గా మారిపోతుంది. అలాగే పొడిబారడం, మొటిమలు, నల్లటి వలయాలు వంటి సమస్యలకు దారి తీస్తుంది. అయితే కొన్ని సూపర్‌ఫుడ్స్‌ తీసుకుంటే మీ చర్మానికి నిగారింపు వస్తుంది.

బ్లూబెర్రీస్, అవకాడో, టమోటా, కలబంద, సముద్రపు నాచు నుంచి తయారు చేసే జెల్, మునగ, డార్క్‌ చాక్లెట్‌ వంటివి చర్మానికి ఎంతో మేలు చేస్తాయి. నిమ్మ, పసుపు, చిలగడదుంపలు మొదలైనవి కూడా ఈ హెల్తీ డైట్ కేటగిరీ కిందకే వస్తాయి. ఇవి కూడా మీకు చర్మ నిగారింపునకు దోహదపడతాయి.

అలాగే రోజులో వీలైంనంత ఎక్కువగా మంచి నీరు తాగాలి.  మాయిశ్చరైజర్, టోనర్, లోషన్స్, క్రీమ్స్, సన్ స్క్రీన్ లోషన్ ఇలా చాలా రకాల ప్రొడక్ట్స్ మనం వాడుతూ ఉంటాం. వీటిలో ఉండే అనేక రసాయనాలు చర్మానికి హాని కలిగిస్తాయి. కాబట్టి సహజమైన కాస్మోటిక్స్ వాడండి. మీ చర్మం మిమ్మల్ని ఎన్నో రకాల ఇన్ఫెక్షన్స్ నుండి కాపాడుతుంది.  సహజమైన సబ్బు లేదా సున్నిపిండి వాడటం వల్ల చర్మం ఆరోగ్యంగా ఉంటుంది. ఒత్తిడి వలన ఎన్నో రకాల ఆరోగ్య సమస్యలు వస్తాయి. ఇది మన చర్మం ఆరోగ్యాన్ని చాలా ప్రభావితం చేస్తుంది. కాబట్టి ఆరోగ్యకరమైన చర్మం కావాలంటే ఒత్తిడిని తగ్గించుకోవడం చాలా ముఖ్యం యోగ, మెడిటేషన్ లేదా ప్రకృతిలో గడపడం ద్వారా ఒత్తిడిని తగ్గించుకోండి. ఆరోగ్యకరమైన చర్మం కోసం చక్కగా  నిద్రపోండి.

Exit mobile version