ప్రస్తుతం కాలంలో ప్రతి ఒక్కరూ ఎలక్ట్రికల్ వస్తువులు అధికంగా చూడటం, సరైన పోషకాహారం తీసుకోకపోవడం వల్ల కళ్ల మంటలతో బాధపడేవారి సంఖ్య రోజు రోజుకూ పెరిగిపోతోంది. సెల్ ఫోన్లు అధికంగా చూడటం, కంప్యూటర్ ముందు కూర్చోవడం, నిద్రలేమి సమస్యలతోనూ కళ్లు మంటలు వస్తాయి. మరి ఈ సమస్యల నుండి బయటపడాలంటే కొన్ని టిప్స్ పాటిస్తే బాగుంటుంది. కీరదోస కాయ చల్లటి గుణాలు కలిగి ఉంటుంది. కీరదోసకాయను అడ్డంగా, సన్నగా ముక్కలు కట్ చేసి, 2 గంటలు ఫ్రిజ్ లో పెట్టాలి. చల్లగా మారిన తరవాత కళ్ళ మీద పెట్టి కొద్ది సేపు రిలాక్స్ అవ్వాలి. లేదా కీరదోసకాయను పేస్ట్ చేసి, అందులో రసం తీసి, కాటన్ ను డిప్ చేసి కళ్ళ మీద కొద్దిసేపు ఉంచాలి.
ఇలా చేయడం వల్ల కళ్ళ మంటలు తగ్గుతాయి. కళ్ళ ఉబ్బును కూడా తగ్గిస్తాయి. బంగాలదుంప కూడా కళ్ల మంటలను తగ్గిస్తుంది. బంగాళ దుంపలో యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు అధికంగా ఉన్నాయి. ఇవి కళ్ళ ఉబ్బును చాలా ఎఫెక్టివ్ గా నివారిస్తాయి. పొటాటోను కూడా రౌండ్ కట్ చేసి ఫ్రిజ్ లో పెట్టాలి. ఒక గంట తర్వాత బయటకు తీసి కళ్ళ మీద పెట్టుకోవాలి. ఇది కూడా కళ్ళ ఉబ్బును, దురదను తగ్గిస్తుంది. చీకాకు తగ్గిస్తుంది.
అలాగే ఫ్రెష్ గా తయారుచేసిన బంగాళదుంప రసంలో కాట్ డిప్ చేసి కళ్ళ మీద ప్లేస్ చేసి, రిలాక్స్ అవ్వాలి. అలోవెరలో మెడిసినల్ లక్షణాలు, యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు అధికంగా ఉన్నాయి. ఇవి కళ్ళకు చాలా మేలు చేస్తాయి. కలబంద ఆకు నుండి ఫ్రెజ్ గా జెల్ ను వేరు చేసుకుని, ఫ్రిజ్ లో పెట్టాలి. కొద్దిసేపటి తర్వాత బయటకు తీసుకి కళ్ళకు అప్లై చేయాలి. ఇది ఐ ఇన్ఫ్లమేషన్ ను చాలా ఎఫెక్టివ్ గా నివారిస్తుంది. అలాగే జెల్లో కొద్దిగా కాటన్ డిప్ చేసి, కళ్ళ మీద ప్లేస్ చేయాలి. కళ్ళ ఉబ్బు ఎఫెక్టివ్ గా తగ్గించుకోవచ్చు.