Health Insurance Policy: ఈ మధ్య కాలంలో ప్రతి ఇంట్లో ఒక్కరు వారి ఆరోగ్య బీమా కోసం ఏదో ఒక పాలసీ తీసుకుంటూనే ఉన్నారు. ఇక ప్రస్తుత కాలంలో కరోనా మహమ్మారి పెరగడం వల్ల ఇన్సూరెన్స్ పాలసీల మీద ప్రజలు మరింత దృష్టి పెట్టారు. ఇదంతా పక్కన పెడితే ఇన్సూరెన్స్ పాలసీ తీసుకునే ముందు కొన్ని జాగ్రత్తలు తప్పకుండా తీసుకోవాలట. అవేమిటో ఇప్పుడు మనం తెలుసుకుందాం.
అసలు ముందుగా బీమా పాలసీ తీసుకునే సమయంలో మనకు ఆ పాలసీకి సంబంధించిన విషయాలు పూర్తిగా తెలిసి ఉండాలి. ఒకవేళ తెలియకపోతే తెలిసిన వారిని అడిగి తెలుసుకోవాలి. పాలసీ తీసుకునే ముందు ముఖ్యమైన ఆరోగ్య పరిస్థితులు మెన్షన్ చేయాలి.
ఆ పాలసీని క్లైమ్ చేయాలనుకున్నప్పుడు.. ఆ బీమా కు సంబంధించిన అన్ని విషయాల మీద అవగాహన ఉండాలి. ఒక్కో పాలసీ ఒక్కో విధంగా ఉంటుంది. కనుక మీకు అన్ని పాలసీలపై అవగాహన ఉండాలి. ముందుగా మీకు ఉన్న ఆరోగ్య సమస్యల పూర్తి వివరాలు సమర్పించండి. సరైన డాక్యుమెంట్లు, కావాల్సిన రిపోర్టులు అన్ని పర్ఫెక్ట్ గా ఉండటం మంచిది.
అలా ఉంటే ఏ కంపెనీ కూడా క్లెయిమ్ ను రిజెక్ట్ చేసే అవకాశం ఉండదు. మీరు ఆ విషయంలో నిర్లక్ష్యంగా ఉంటే మీరు ఇబ్బందులు పడక తప్పదు. నిబంధనలు ఆధారంగానే పాలసీలో చేర్పులు మార్పులు ఉంటాయి. కనుక పాలసీ తీసుకునే వారు తగిన జాగ్రత్తలు తీసుకుంటే మంచిది. మీకు ఈ పాలసీ పై అవగాహన లేకపోతే నిపుణుల సమక్షంలో చేసుకోవడం మంచిది.