Site icon 123Nellore

దళిత ద్రోహులుగా చరిత్రలో నిలిచిపోయారు : సాకె శైలజానాథ్

దళిత ద్రోహులుగా వైసీపీ నేతలు చరిత్రలో మిగిలిపోయారని ఏపీసీసీ అధ్యక్షులు సాకే శైలజానాథ్ విమర్శించారు. నిందితులకు కొమ్ముకాయడం మాని బాధితులకు అండగా నిలవాలని సూచించారు. అధికార పార్టీ ప్రజాప్రతినిధులే నిర్భీతిగా హత్యలు చేస్తుంటే దళిత మంత్రులు చోద్యం చూస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్రంలో దళితులకు రక్షణ ఇదేనా? అని ప్రశ్నించారు. మూడేళ్లలో దళితులకు జగన్ రెడ్డి చేసిన మేలు ఏంటో చెప్పే దమ్ము, ధైర్మం ఉందా? అని మండిపడ్డారు. వైసీపీ మంత్రులు ఇప్పుడు ఏమంటారని, వైసీపీ ఎమ్మెల్సీ అనంత ఉదయభాస్కర్‌ తానే హత్య చేసినట్లు ఒప్పుకున్నా వైసీపీ మంత్రులు ఇంకా కట్టు కథలు చెబుతున్నారని వ్యాఖ్యానించారు.

రాష్ట్రంలో అరాచకపాలన సాగుతోందని, ప్రజలు అనుకున్నదానికంటే భిన్నంగా జగన్ పాలన సాగిస్తున్నారని విమర్శించారు. మోడీకి బెదిరిపోయి జగన్ నోరు తెరవడం లేదని, రాష్ట్ర హక్కులను కాలరాశారని ఆరోపించారు. 25 మంది ఎంపీలను ఇస్తే మోడీ మెడలు వంచి హోదా తెస్తామని ఎన్నికల ముందు రాష్ట్రమంతా తిరిగి చెప్పి నేడు హోదా అంశాన్ని విస్మరించారని విమర్శించారు. పోలవరాన్ని చేతకాని తనంతో నిర్వీర్యం చేశారని ఆరోపించారు.

దేశ వ్యాప్తంగా కాంగ్రెస్ పుంజుకుంటోందని, కాంగ్రెస్ పాలనతోనే దేశాభివృద్ధి అని పేర్కొన్నారు. పేదల పార్టీ అయిన కాంగ్రెస్ అధికారంలోకి రావాలని అభిప్రాయపడ్డారు. కాంగ్రెస్ పార్టీని ప్రక్షాలన చేసే పనులు ప్రారంభమయ్యాయని వచ్చే ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా కాంగ్రెస్ పనిచేస్తుందని తెలిపారు. రాహుల్ గాంధీ దేశ వ్యాప్తంగా పాదయాత్ర చేసి, ప్రజల కష్టాలను నేరుగా తెలుసుకుంటాని పేర్కొన్నారు. ఏపీలోనూ కాంగ్రెస్ బలోపేతానికి కృషి చేస్తున్నామని, కచ్చితంగా కాంగ్రెస్ అదికారంలోకి వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

Exit mobile version