Site icon 123Nellore

డ్రాగన్ ఫ్రూట్ తో ఈ ఆరోగ్య ప్రయోజనాలు..!

డ్రాగన్ ఫ్రూట్ ప్రయోజనాలు తెలిసిన తర్వాత వీటి సాగు కూడా ఎక్కువైంది. దశాబ్ధకాలం వరకు విదేశాలకు పరిమితమైన ఈసాగు ఇప్పుడిప్పుడే దేశంలో విస్త్రీర్ణం పెరుగుతోంది. దీనికి గిరాకీ కూడా బాగానే ఉంటుంది. ఈ డ్రాగన్ ఫ్రూట్ వల్ల వివిధ రకాలైన పోషకాలు కలిగి ఉంది. ఇందులో అధికంగా ఫైబర్ ఉంటుంది. గర్భిణిలు, ఆరోగ్య కరమైన కార్బో హైడ్రేట్లు కలిగి ఉంటుంది. పెద్ద పేగు క్యాన్సర్ విసయంలో రోగ నిరోధక శక్తిని బలోపేతం చేస్తుంది. నీరు అధికంగా ఉండే ఈ పండు శరీర ద్రవాలను పెంచుతుంది. చర్మాన్ని కూడా హైడ్రేడ్ చేస్తుంది.

డయాబెటిస్ ను కూడా నివారించడానికి సహాయ పడుతుంది. రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గించే అనేక పోషకాలు ఈ డ్రాగన్ ఫ్రూట్ లో ఉన్నాయి. అధిక కాల్షియం అవసరాన్ని ఈ డ్రాగన్ ఫ్రూట్ తీరుస్తుంది. రోజువారి కాల్షియంలో ఈ ఫ్రూట్ 70 శాతం అందిస్తుంది. పంటి సమస్యలతో బాధ పడేవారికి కూడా ఇది ఉపయోగపడుతుంది. ఇందులో కాల్షియం ఎక్కువగా ఉండటం వల్ల పంటి నొప్పి, సమస్యలను నివారిస్తుంది.

డ్రాగన్ ఫ్రూట్ కంటిలోని ద్రవాన్ని సమతుల్యం చేయడం వల్ల కంటి శుక్లాలను నివారిస్తుంది. వృధాప్యంలో అల్జీమర్స్ వ్యాధిని నివారించడంలో ఈ డ్రాగన్ ఫ్రూట్ సహాయపడుతుంది. ఇది ఇతర మెదడు వ్యాధుల నుండి కూడా రక్షిస్తుంది. ఈ డ్రాగన్ పండు ప్యాక్ ను ముఖం మీద ఆరిపోయే వరకు ఉంచాలి. తర్వాత గోరు వెచ్చని నీటితో కడగాలి. ఇలా చేయడం వల్ల మొటిమలను నివారించవచ్చు. పేగులో పోషకాలు పేరుకుపోకుండా మలబద్ధకాన్ని దూరం చేస్తుంది.

Exit mobile version