పేరులేని రైల్వే స్టేషన్ ఏంటి? అని ఆలోచిస్తున్నారా అవును నిజంగానే ఒక రైల్వే స్టేషన్ కి పేరు లేదు. ఇండియాలో అన్నీ రైల్వే స్టేషన్ లకు వాటి ప్రాంతాల వారీగా పేర్లు ఉన్నాయి. కానీ ఒక స్టేషన్ కి మాత్రం పేరు ఉండకపోవడం ఆశ్చర్యంగా ఉంది. ఇంతకూ అసలు విషయం ఏంటో చూద్దాం. బెంగాల్ లోని బర్ద్వాన్ నగరంలో పూర్వ వర్ధమాన్ జిల్లాలో రైనా, రైనా నగర్ అనే రెండు గ్రామాలు ఉన్నాయి. రైనా గ్రామానికి దగ్గరలో కొత్తగా ఓ రైల్వే స్టేషన్ ను నిర్మించారు.
దానికి రైనా నగర్ రైల్వే స్టేషన్ అని పేరు పెట్టారు. కానీ
ఈ పేరు పెద్ద వివాదానికి దారి తీసింది. ఎందుకంటే రైనా నగర్ రైల్వే స్టేషన్.. రైనా, రైనా నగర్ గ్రామాలను కలుపుకుని ఉంటుంది. అక్కడే పెద్ద చిక్కు వచ్చి పడింది. దానికి రైనా నగర్ అని పేరు పెట్టడం రైనా గ్రామ ప్రజలకు నచ్చలేదు. తమ ఊరి పేరు ఎందుకు పెట్టలేదని వాళ్ళు వాదానికి దిగారు. దీనిపై స్టేషన్ అధికారులు ఏం సమాధానం చెప్పలేకపోయారు. ఈలోపు రైనా నగర్ ఊరి ప్రజలు అంతకు ముందు పెట్టిన పేరు తొలగించడానికి వీలు లేదని ఖండించి చెప్పారు.
ఈ స్టేషన్ రైనా గ్రామానికి దగ్గరగా ఉందని రైనా ఊరి ప్రజలు తిరుగుబాటు చేశారు. అందుకని ఆ రైల్వే స్టేషన్ పేరు కూడా రైనా రైల్వే స్టేషన్ అని పేరు పెట్టాలని డిమాండ్ చేశారు. దాంతో ఆ రెండు గ్రామాల మధ్య పెద్ద గొడవలు మొదలయ్యాయి. ఈ రచ్చ రైల్వే బోర్డర్ వరకు వెళ్ళింది. గొడవ జరిగిన తర్వాత రైల్వే శాఖ స్టేషన్ పేరును అన్నీ బోర్డుపైన నిషేధించింది. అలా ఆ సమస్యకు కొంత వరకు పుల్ స్టాప్ పెట్టడం జరిగింది.