Swiggy Delivery Boy: ఈ మధ్యకాలంలో కొంతమంది తమ పనులు మానుకుని తోటివారికి సహాయం చేయడంలో ముందడుగు లో ఉన్నారని చెప్పవచ్చు. సోషల్ మీడియా ప్రభావం వల్ల ఇలాంటి వారు మరింత వెలుగులోకి వస్తున్నారు. ఇదే క్రమంలో ఒక స్విగ్గీ డెలివరీ బాయ్ చేసిన సహాయం గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం.
ఒక పెద్దాయన పేరు మన్మోహన్ మాలిక్. అతను డిసెంబర్ 25న అనారోగ్యం పాలయ్యాడు. దాంతో ఆయన కొడుకు మనీష్ హాస్పిటల్ కి కారు లో తీసుకెళ్తున్నాడు. అది ముంబై నగరం.. ఆ టైం లో వేరే స్థాయిలో ట్రాఫిక్ ఉంటుంది. ఆ కారు ముందుకు వచ్చేలా లేదు.. వెనుకకు వెళ్లేలా లేదు. ఆ కారులో పెద్దాయన మాత్రం చావు బ్రతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నాడు.
ఇంతలో మనీష్ కారు దిగి చాలామంది టు వీలర్స్ కలిగిన వ్యక్తులను బ్రతిమిలాడాడు. కానీ వారు వాళ్ళు ఏ మాత్రం పట్టించుకోలేదు. ఇంతలో అటుగా ఒక స్విగ్గీ డెలివరీ బాయ్ వెళుతున్నాడు. వెంటనే ఆ పెద్దాయన పరిస్థితి తన కొడుకు ఆ డెలివరీ బాయ్ కి చెప్పుకున్నాడు. అలా చెప్పాడో లేదో వెంటనే ఆ పెద్దాయనను తన టూ వీలర్ పైకి ఎక్కించుకున్నాడు.
ఇక ఎమర్జెన్సీ కేస్ అని గట్టిగా అరుచుకుంటూ.. ముసలాయన ను హాస్పిటల్లో జాయిన్ చేసాడు. సరైన సమయానికి మీ నాన్నను హాస్పిటల్ కి తీసుకు వచ్చారు అని ఆ పెద్దాయన కొడుకుతో చెప్పారు. ఆ తర్వాత ఆ పెద్దాయన కూడా నేను బతకడానికి కారణం ఆ డెలివరీ బాయ్ అని చెప్పాడు. ఇక ఆ డెలివరీ బాయ్ పేరు మృణాల్. ఇతను చేసిన పనిని నెటిజన్ల ను ఎంతగానో ఆకట్టుకుంటుంది.