ప్రస్తుత కాలంలో ప్రేమ పెళ్లిళ్లు చేసుకోవడం సర్వసాధారణం. అయితే కొందరు వారి ప్రేమ పెళ్ళిని అంగీకరిస్తే మరికొందరు పరువు నష్టం జరిగింది అంటూ వారిని హత్య చేయడానికి కూడా వెనకాడరు. ఇలాంటి పరువు హత్యలు ఎన్నో జరుగుతూ ఉంటాయి. తాజాగా ఇలాంటి పరువు హత్య మహారాష్ట్రలోని ఔరంగాబాద్ జిల్లాలో ఆదివారం చోటుచేసుకుంది. తన అక్క ప్రేమ పెళ్లి చేసుకుందని తన పై కోపంతో తమ్ముడు ఏకంగా తన అక్కను దారుణంగా హత్య చేసిన ఘటన చోటుచేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళితే…
అయితే కీర్తి భర్త అనారోగ్యం చేయడంతో మరొక గదిలో విశ్రాంతి తీసుకుంటూ ఉండగా ఇదే అదునుగా భావించిన కీర్తి సోదరుడు తల్లి కీర్తి కాళ్ళను పట్టుకోగా తన సోదరుడు తన తలను దారుణంగా నరికాడు. ఇలా కొడవలితో విచక్షణరహితంగా కీర్తి మొండెం నుంచి తలను వేరు చేసి ఆ తలతో సెల్ఫీలు దిగారు.అలాగే తన కూతురు తలను గాల్లోకి విసురుతూ ఉండడంతో చుట్టుపక్కల వారు ఎంతో భయభ్రాంతులకులోనై పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలోనే పోలీసులు తన తల్లి సోదరుడిని అదుపులోకి తీసుకున్నారు.