Sundaram Master: సుందరం మాస్టర్.. ఈ పేరు టాలీవుడ్ ప్రేక్షకులకు ప్రత్యేకించి పరిచయం అవసరం లేదు. సినీ ప్రపంచంలో కొరియోగ్రాఫర్గా ఓ రేంజ్ లో దూసుకువచ్చాడు. దాదాపు 1200చిత్రాలకు పైగా దర్శకత్వం వహించి దర్శకుడిగా తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇక టాలీవుడ్ లో సీనియర్ కొరియోగ్రాఫర్ గా ప్రేక్షకులలో చెరగని ముద్ర వేసుకున్నాడు సుందరం మాస్టర్.
ఇదిలా ఉంటే నటి సుధ ను సుందరం మాస్టర్ తనను అవమానించిన సంఘటన గురించి తెలిపింది. ” సినీ ఇండస్ట్రీలో నాకు జరిగిన అవమానం ఏమిటి అంటే ఒక షూటింగ్ సమయంలో భాగంగా నాకు సుందరం మాస్టర్ ఒక చిన్న డాన్స్ మూమెంట్స్ చెప్పారు. నేను ఎందుకో ఆ మూమెంట్ సరిగ్గా చేయలేకపోయాను. అలా నాలుగైదు టేక్ ల వరకు చేయలేకపోయాను.
దాంతో అసహనం వ్యక్తం చేసిన సుందరం మాస్టర్ ఛీ.. నువ్వు వ్యభిచారం చేయడానికి కూడా పనికిరావు. ఇలా అందరి ముందు ఇంత పెద్ద మాట అనేసరికి నేను తట్టుకోలేక పోయాను. ఇక ఏడుస్తూ షూటింగ్ మధ్యలో నుంచి బయటకు వెళ్ళిపోయాను” అని తెలిపింది సుధ.
ఇక ఇదే క్రమంలో సుధ..చిన్న ఆర్టిస్ట్ అయినా పెద్ద ఆర్టిస్ట్ ఆ మాట అనడం చాలా తప్పు కాబట్టి అక్కడి నుంచి ఏడ్చుకుంటూ మా ఇంటికి వెళ్లాను అని తెలిపింది. ఆ సమయంలో సుధకు తన తల్లే ధైర్యం చెప్పింది అని పేర్కొంది.