Site icon 123Nellore

పట్టాలపై ల్యాండ్ అయిన విమానం.. దూసుకొచ్చిన రైలు.. అంతలోనే అద్భుతం!

Viral Video: పట్టాలపై ల్యాండ్ అయిన విమానాన్ని రైలు గుద్దటం ఏమిటి? సినిమా స్టోరీ చెబుతున్నాడా అని ఆలోచిస్తున్నారా.. కానీ ఇది నిజమే అమెరికాలోని లాస్ ఏంజిల్స్‌లోని ఈ స్టంట్ స్టంట్ జరిగింది. ఓస్‌బోర్నే స్టేషన్‌కి దగ్గరగా శాన్ ఫెర్నార్డో రోడ్డుపై ఈ ఘటన జరిగింది. అసలు జరిగిందేమిటి అంటే పైలెట్ చిన్న విమానంలో వెళుతూ ఉండగా..

Viral Video
Viral Video

ఆ విమానంలో ఏదో లోపం వచ్చి ఆ టైంలో అతనికి ఏమీ అర్థం కాలేదు. విమానం ఒక్కసారిగా కిందపడేలా అనిపించింది. ఆ పైలెట్ కు అక్కడి నుంచి తప్పించుకోవడం కుదరడం లేదు. ముప్పతిప్పలు పడి సరిగ్గా రైలు క్రాస్ అయ్యే ట్రాక్ పైన ఎమర్జెన్సీ ల్యాండ్ చేశాడు. అప్పటికి అది సరిగా ల్యాండ్ అవ్వలేదు. ఇక అతను విమానం నుంచి బయటికి రాలేని స్థితిలో ఉన్నాడు.

అతని టైం బావుండి ఇద్దరు ఫుట్‌హిల్ డివిజన్ ఆఫీసర్లు అతనిని కాపాడారు. అతని మోసుకుంటూ ఫాస్ట్ గా అక్కడి నుంచి తీసుకువెళుతుండగా.. అటుగా వస్తున్న రైలు రానేవచ్చి ఆ విమానాన్ని తునకలు చేసి ఓ రేంజ్ లో దూసుకుపోయింది. అక్కడికి ఆఫీసర్లు రావడం ఒక్క నిమిషం లేట్ అయితే ఆ వ్యక్తి ఈ లోకానికి శాశ్వతంగా గుడ్ బై చెప్పే వాడు.

ఆ ఇద్దరు వ్యక్తుల బాడీ కామ్ ద్వారా ఈ వీడియో రికార్డ్ అయ్యింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారింది. ఈ వీడియో చూసిన నెటిజన్లు అక్కడ హీరోల లాగా వచ్చిన ఇద్దరు వ్యక్తులను తమదైన స్టైల్లో మెచ్చుకుంటున్నారు.

Exit mobile version