Site icon 123Nellore

మీరు చేసినవే చట్టాలు..మేము చేసినవి కాదా.? మంత్రి కన్నబాబు

రాజధాని అమరావతిపై హైకోర్టు తీర్పు ఇచ్చిన తర్వాత చంద్రబాబులో ఆత్మవిశ్వాసం పెరిగిపోయినట్టుందని మంత్రి కన్నబాబు విమర్శించారు. వాల్లు చేసినవే చట్టాలు.. తాము చేసినవి చట్టాలు కావా అని ప్రశ్నించారు.  మీ చట్టాలు పనికొచ్చినప్పుడు  తము చేసినవి ఎందుకు పనికిరావన్నారు. జగన్మోహన్ రెడ్డి సారధ్యంలో అమరావతితో పాటు అన్ని ప్రాంతాలను అభివృద్ధి చేస్తామని స్పష్టం చేశారు. తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో శనివారం మీడియాతో మాట్లాడారు.

ప్రజల కోరిక మేరకే మూడు రాజధానులని పేర్కొన్నారు. వేల కోట్ల రూపాయలు పంటలకు రుణం ఇచ్చిన ప్రభుత్వం తమదని, భారతదేశ చరిత్రలో రైతులకు ఎస్ఈజెడ్ భూములు తిరిగి ఇచ్చిన ఘనత జగన్‌మోహన్‌రెడ్డికే దక్కుతుందన్నారు. దమ్మున్న నాయకుడు సీఎం జగన్‌ అని, రైతులకు ఇన్పుట్ సబ్సిడీ ఇచ్చిన ఘనత తమదేనన్నారు. రైతులకు ఉచితంగా పంటల బీమాను చేశామని తెలిపారు.

చంద్రబాబు ఎప్పటికీ రైతుబంధు కాలేరని, రైతు రాబందే అవుతారని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. అమరావతి ఒక్కటే అభివృద్ధి చెందాలంటే అది రియల్‌ ఎస్టేట్‌ అవుతుందని ఆరోపించారు. పోలవరం ప్రాజెక్టును కేంద్రం చేతుల నుండి నిర్మిస్తామని ఎవరు తీసుకున్నారని ప్రశ్నించారు. ప్యాకేజీ కోసం వారం వారం పోలవరం అంటూ డ్రామా చేసింది చంద్రబాబు కాదా ప్రశ్నించారు. ఆర్‌ అండ్‌ ఆర్‌ అడిగిన రైతులపై కేసులు పెట్టిన చరిత్ర టీడీపీది అని, వ్యవసాయం దండగ అన్న ముఖ్యమంత్రి చంద్రబాబే అన్నారు. వ్యవసాయ శాఖను మూసేయడానికి ఆ శాఖ ఏమన్నా టీడీపీ కార్యాలయమా అని ప్రశ్నించారు. దేశంలో రైతు భరోసా అందిస్తున్న ఏకైక ప్రభుత్వం తమదేనని స్పష్టం చేశారు.

Exit mobile version