Site icon 123Nellore

మెడలు వంచి ప్రజలకు మేలు చేయించడమే మా ఉద్దేశం : అచ్చెన్నాయుడు

ప్రజల ప్రాణాల కంటే ముఖ్యమైన అంశం ప్రభుత్వానికి ఇంకేమైనా ఉందా? అని  టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు కింజరాపు అచ్చెన్నాయుడు ప్రశ్నించారు. అధికారంలోకి వస్తే మద్యపానం నిషేధిస్తామని జగన్ చెప్పలేదా? అని నిలదీశారు.  మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఎమ్మెల్యేలతో కలిసి మద్యంపై మీడియాతో మాట్లాడారు.  హామీలు అమలు చేయట్లేదనడానికి మద్య నిషేధ హామీ ఓ ఉదాహరణగా పేర్కొన్నారు. ప్రభుత్వ మెడలు వంచి ప్రజలకు మేలు చేయాలన్న ఉద్దేశమే తమదని వివరించారు.

ఆదాయం తగ్గించుకుంటూ వెళ్తానని జగన్ చెప్పారని, 2014-15లో 11,569 కోట్లు మద్యం విక్రయాలు జరిగేవి.. 2021-2022లో 24,714 కోట్లు మద్యం విక్రయాలు జరిగాయని వివరించారు. రూ.11 వేల కోట్ల నుంచి రూ.24 వేల కోట్లకు ఆదాయం పెరిగిందా..లేదా? నిలదీశారు. తమ ప్రశ్నలకు ముఖ్యమంత్రి సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వానికి కాదు.. తాడేపల్లి ప్లాలెస్‍కు, సీఎం జగన్‍కు ఆదాయం రావాలని లక్ష్యం పెట్టుకున్నారని ఆరోపించారు. 10 వేల కోట్లు ఆదాయం రావాలని లక్ష్యంగా పెట్టుకున్నారని తెలిపారు.

ఎంత ఆదాయం వస్తుందో పూర్తి ఆధారాలు తమ వద్ద ఉన్నాయని, ఎక్కడి నుండి ఎంత ఆధాయం, ఏ సమయంలో తాడేపల్లికి వస్తుందో ఆధారాలతో సహా నిరూపిస్తామని సవాల్ విసిరారు. కొత్త బ్రాండ్లు తీసుకొచ్చి ప్రజల ప్రాణాలు తీస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. నాటుసారా మరణాలపై చర్చించాలని కోరితే సస్పెండ్ చేస్తారా? అని మండిపడ్డారు.  ప్రజల ప్రాణాల కోసం తమ ప్రాణాలను పణంగా పెట్టి పోరాడుతున్నాని ప్రకటాంచారు. సభలో నిన్న సీఎం జగన్ రెడ్డి చెప్పిన ప్రతి మాటా అవాస్తవమన్నారు. ఈ కార్యక్రమంలో అచ్చెన్నాయుడుతో పాటు మిగిలిన ఎమ్మెల్యేలు పాల్గొన్నారు.

Exit mobile version