Tirthanand Rao: కపిల్ శర్మ తో కలిసి నటించిన కమెడియన్ తీర్థానందరావు గురించి చాలా తక్కువ మందికి పరిచయం. ఇటీవల ఓ గుజరాతి చిత్రంలో కూడా నటించాడు. ఇక 15 సంవత్సరాలుగా పని చేస్తున్న ఈ హాస్యనటుడుని పటేకర్ గా కూడా పిలుస్తారు. ఇక ప్రస్తుతం సినీ పోటీ ప్రపంచంతో కొందరు నటులు పోటీపడలేక పోతున్నారు.
అతడికి సినీ రంగంలో సరైన అవకాశాలు దొరకకపోవడంతో ఆర్థికంగా చాలా సమస్యలు ఎదురవడం తో అతడు ఆత్మహత్య చేసుకోవాలని అనుకున్నాడు. ఇక అతని టైం బాగుండడంతో చుట్టుపక్కల ఉన్న వారు అతడిని సమయానికి ఆసుపత్రికి తీసుకు వెళ్లారు. తిరిగి నాలుగు రోజుల్లో కోలుకున్నాడు.
తనకు ఆర్థికంగా కుటుంబ సభ్యులు సపోర్టు లేని పరిస్థితి ఏర్పడింది. ఇదే విషయం గురించి కమెడియన్ తీర్థానంద్ ఆజ్ తక్‌తో ఇలా మాట్లాడుతూ.. “కొంతకాలంగా ఆర్ధికంగా కొట్టుమిట్టాడుతున్న నా కుటుంబం కూడా నన్ను వదిలేసింది. నేను ఆస్పత్రిలో ఉన్న సమయంలో మా అమ్మ తమ్ముడు కూడా నన్ను చూడడానికి రాలేదు’ ఆస్పత్రి నుంచి ఇంటికి వచ్చిన తర్వాత నేను ఇంట్లో ఒక్కడినే ఉన్నానంటే ఇంతకంటే దారుణం ఏముంటుంది? ” అని ఎమోషనల్ అయ్యాడు.