Site icon 123Nellore

జగన్ ఏం పీకలేదో పది పుస్తకాలు రాయొచ్చు : టీడీపీ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్

వాస్తవానికి, ఊహలకు భిన్నంగా కనిపించే సరికి సీఎం జగన్ రెడ్డి భాష మారిందని పీఏసీ కమిటీ ఛైర్మన్, టీడీపీ శాసన సభ్యులు పయ్యావుల కేశన్ అన్నారు. తన అసమర్థతను కప్పిపుచ్చుకునేందుకు భాషలో స్వరాన్ని పెంచుతున్నారని విమర్శించారు. హైదరాబాద్ లోని టీడీపీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. సీఎంగా ఉన్న వ్యక్తి అలాంటి భాష మాట్లాడకూడదని హితవు పలికారు. ప్రజలు అధికారం ఇచ్చి మూడేళ్లైందని, ఆయన ఏం పీకారో చెప్పాలని డిమాండ్ చేశారు. ప్రజల జీవితాల్లో వెలుగులు పీకడమా మీరు చేసిందని ప్రశ్నించారు.

పీకుడు భాష మేం మాట్లాడే వాళ్లం కాదన్నారు. సీఎం మాట్లాడిన తర్వాత పీకుడు భాష మాట్లాడాల్సి వచ్చిందని తెలిపారు. మూడేళ్లలో ఒక్క పనైనా సక్రమంగా చేశారా అని ప్రశ్నించారు. మూడేళ్లలో ఒక్క పనైనా సక్రమంగా చేశారా.. కనీసం ఒక రోడ్డు అయినా వేశామని ముఖ్యమంత్రి చెప్పుకోగలరా అని నిలదీశారు. యువత, మహిళలు, రైతుల జీవితాల్లో జగన్ వెలుగులను పీకేశారని మండిపడ్డారు. జగన్ అటెన్ష్ కోసమే అనుచిత భాషను ఉపయోగిస్తున్నారని వ్యాఖ్యానించారు.భాష మార్చుకోకపోతే ప్రజలే పీకే పరిస్థితి వస్తుంద అని విమర్శించారు.

పీకేను పీకే ధైర్యం ఉందా అని జగన్ ను ప్రశ్నించారు. రాయలసీమలో ఎంతమంది మంత్రులను పీకుతారో చూద్దామన్నారు. ప్రతిపక్షాలు, మీడియాపై పీకుడు భాషతో దాడి చేస్తారా? ఆగ్రహం వ్యక్తం చేశారు. తన బలహీనతను దాచుకోవడానికే సీఎం జగన్ పీకుడు భాష వాడుతున్నారని మండిపడ్డారు. సొంత కేబినెట్‌ను మార్చుకోలేని వ్యక్తి.. ప్రతిపక్షాలను పీకుతారా అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. రాయలసీమ ప్రాజెక్టులకు తాను ఏమి చేశామో జగన్ చెప్పాలని.. అసలు ఆయన ఏం చేశారో ఒక పుస్తకం రాస్తే.. ఏమి పీకలేదో పది పుస్తకాలు రాయొచ్చని ధ్వజమెత్తారు.

 

Exit mobile version