Site icon 123Nellore

బిగ్ బాస్ నాన్ స్టాప్ షురూ.. ఈ సీజన్‌ కంటెస్టెంట్స్‌ లిస్ట్‌ ఇదే..!

Telugu bigboss ott contestants list

బుల్లితెర సెన్సేషన్‌ బిగ్‌ బాస్‌ వివిధ బాషల్లో అనేకమంది అభిమానులు సొంత చేసుకుంది. తెలుగులో 5 సీజన్‌ల నుంచి ప్రేక్షకులను అలరిస్తున్న “బిగ్ బాస్ షో” ఇప్పుడు కొత్తగా OTT వెర్షన్ తో స్ట్రీమింగ్‌కి రెడీ అయ్యింది. డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో “బిగ్ బాస్ నాన్ స్టాప్” అనే కొత్త వెర్షన్‌తో ఫిబ్రవరి 26 నుంచి అందరినీ అలరించడానికి రెడీగా ఉంది.

ఓటీటీ వెర్షన్‌కి కూడా హోస్ట్ గా నాగార్జుననే వ్యవహరించనున్నారు. ఇప్పటికే బిగ్ బాస్ హౌస్ కి వెళ్లే కంటెస్టెంట్స్ ఎవరనే విషయంపై కొంతమేక క్లారిటీ వచ్చింది. గత సీజన్లలో కనిపించిన పాత కంటెస్టెంట్స్‌తో పాటు కొత్తవాళ్లను కూడా తీసుకోబోతున్నారు.  ఫిబ్రవరి 26 న సాయంత్రం 6 గంటలకు మాత్రమే అసలు ఎవరెవరు షోలో ఉండబోతున్నారో తెలియనుంది. ఈ సందర్భంగా “బిగ్ బాస్ నాన్ స్టాప్” నుంచి కొత్త ప్రోమో విడుదలైంది. ఈ ప్రోమో మొత్తం ‘భీమ్లా నాయక్’ మ్యూజిక్, డైలాగులతో, సస్పెన్స్, సర్ప్రైజ్ లతో నిండిపోయింది.

https://twitter.com/iamnagarjuna/status/1497456938548105219?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1497456938548105219%7Ctwgr%5E%7Ctwcon%5Es1_c10&ref_url=https%3A%2F%2Ftelugu.abplive.com%2Fentertainment%2Fupdate-on-bigg-boss-ott-contestants-23963

ఇప్పటికే క్వారెంటైన్ పూర్తి చేసుకున్న కంటెస్టెంట్లు కాసేపట్లో బిగ్ బాస్ హౌస్‌లోకి ఎంటర్ కానున్నారు. ఇప్పుడు బిగ్ బాస్ ఓటీటీలో పాల్గొనే ఫైనల్ కంటెస్టెంట్స్ వీళ్లేనంటూ ఓ లిస్ట్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఆ లిస్ట్ లో ఎవరి పేర్లు ఉన్నాయంటే..?

1. అరియానా
2. యాంకర్‌ శివ
3. అఖిల్‌ సార్థక్‌
4. సరయు
5. తేజస్వి మదివాడ
6. మహేష్‌ విట్టా
7. అషు రెడ్డి ఫస్ట్‌ ఎంట్రీ
8. హమీదా
9. నటరాజ్‌ మాస్టర్‌
10. నిఖిల్‌
11. మిత్రా శర్మ
12. ముమైత్‌ ఖాన్‌
13. ఆర్జే చైతు
14. శ్రీ రాపాక
15. అనిల్‌ రాథోడ్‌
16. అజయ్‌ కతుర్వార్‌
17. బిందు మాదవి

ఈ సీజన్ లో ఆదర్శ్, తనీష్ ఉంటారని జోరుగా ప్రచారం జరిగింది. కానీ వారిద్దరూ లేరని తెలుస్తోంది. అలానే అఖిల్ సార్థక్ కి కూడా మల్లెమాల సంస్థతో కమిట్మెంట్స్ ఉన్నాయి. మరి ఆయన షోలో కనిపిస్తారో లేదో చూడాలి. ఇక ఈసారి సీక్రెట్ రూమ్ కాన్సెప్ట్ కూడా లేనట్లే. అందరి కంటెస్టెంట్స్‌ను ఒకేసారి హౌస్ లోకి పంపించనున్నారు. అయితే ఒకట్రెండు వారాల్లో వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఉంటుందని సమాచారం.

Exit mobile version