Site icon 123Nellore

పవన్‌ కళ్యాణ్‌ అభిమానులకు గుడ్‌ న్యూస్..!

పవన్‌ కళ్యాణ్‌, రానా దగ్గుబాటి కాంబోలో వస్తున్న లేటెస్ట్‌ మూవీ ‘భీమ్లా నాయక్‌’. మలయాళంలో ఘన విజయం సాధించిన అయ్యప్పన్ కోషియం చిత్రానికి ఇది రీమేక్ గా తెరకెక్కుతోంది. సాగర్ చంద్ర దర్శకుడు. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ ఈ చిత్రానికి స్క్రీన్ ప్లే అందిస్తున్నారు. ఈ శుక్రవారమే బాక్సాఫీస్‌పై దండయాత్రకు సిద్ధం అవుతున్నారు భీమ్లా నాయక్. ఈ సినిమా కోసం అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు. అయితే ఈ సినిమాకు బంపర్ ఆఫర్ లభించింది.

telangana government gave 5th show permission to bheemla nayak movie

తెలంగాణ థియేటర్లలో రెండు వారాల పాటు ఐదు ఆటలు వేసుకోవడానికి అనుమతి ఇస్తూ..ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. దాంతో ఉదయం ఆరు గంటల నుంచి షోలు వేయడానికి డిస్ట్రిబ్యూటర్లు రెడీ అవుతున్నారు. కొన్ని థియేటర్లలో గురువారం అర్ధరాత్రి రెండు గంటలకు బెనిఫిట్ షోలు వేయడానికి కూడా రెడీ అవుతున్నారట. అయితే ఇంకా అధికారికంగా ప్రకటించలేదు. ఆల్రెడీ అమెరికాలో ప్రీమియర్ షోలు వేయడానికి అంతా రెడీ అయ్యింది. ప్రభుత్వ నిర్ణయంతో అభిమానులు తెగ సంబరపడిపోతున్నారు. అయితే ఏపీ థియేటర్లలో బెనిఫిట్‌ షోలు వేసినా, టికెట్లు ఎక్కువ ధరకు అమ్మినా కఠిన చర్యలు తీసుకుంటామని ప్రభుత్వం స్ట్రాంగ్‌ వార్నింగ్‌ ఇచ్చింది.

telangana government gave 5th show permission to bheemla nayak movie

మరోవైపు ఇవాళ హైదరాబాద్‌లోని యూసఫ్ గూడ పోలీస్ గ్రౌండ్స్‌లో భీమ్లా నాయక్ ప్రీ రిలీజ్ ఈవెంట్ జరుగుతోంది. దీనితో భీమ్లా నాయక్ మ్యానియా పీక్స్‌కి చేరుకుంది. ప్రీ రిలీజ్ ఈవెంట్ కి తెలంగాణ మంత్రి కేటీఆర్ చీఫ్ గెస్ట్‌గా హాజరవుతుండడం ప్రత్యేక ఆకర్షణగా మారింది. రాజకీయంగా ఎలా ఉన్నా.. కేటీఆర్, పవన్ మధ్య మంచి సాన్నిహిత్యం ఉంది. దీనితో వీరిద్దరూ ఒకే వేదికపై కనిపించనుండడం ఆసక్తిగా మారింది. అటు పవన్ కళ్యాణ్ ప్రసంగం కోసం లక్షలాది మంది అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

 

Exit mobile version