వైసీపీ అవినీతి పుట్టలోంచి రోజుకో అవినీతి కాలనాగు బయటకు వస్తోందని, గతంలోనే ఆపుట్టలోనుంచి అనేక అవినీతి కాలనాగులు, అనకొండలు బయటకు వచ్చాయని టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరాం ఆరోపించారు. టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఆదివారం మీడియాతో మాట్లాడారు. అవినీతి అనకొండలు, కాలనాగులన్నింటికీ కోరలు పీకి ఇది వరకే వాటిని ప్రజల ముందుంచామని, యథారాజా తథాశ్రేణులు అన్నట్లు అతిపెద్ద అవినీతిఅన కొండ అయిన జగన్ రెడ్డి కింద పనిచేసే మంత్రులు, ఎమ్మెల్యేలు అతనిబాటలోనే నడవడమనేది సాధారణంగా జరిగేదేనన్నారు.
ఈ రాష్టాన్నిపెద్ద అవినీతి అనకొండ పాలిస్తుంటే, ఆ అనకొండ ఏలు బడిలో ఉన్నచిన్నచిన్నకాలనాగులు ప్రజలసొమ్ముని దిగమింగుతున్నాయని ఆరోపించారు. తణుకులో వైసీపీ ఎమ్మెల్యే కారుమూరి నాగేశ్వరరావు అనే కాలనాగు చేరిందని, ప్రజల సొమ్ముని, ప్రభుత్వఖజానాని కొల్లగొట్టడంలో తనకిందివారంతా తనను చూసి నేర్చుకోవాలన్నట్టుగా, ముఖ్యమంత్రే తనపార్టీవారికి దోపిడీకి లైసై న్స్ ఇచ్చేశాడని మండిపడ్డారు. కారుమూరి నాగేశ్వరరావు అవినీతి బాగోతంపై, అధికారపార్టీకి చెందిన స్థానికనేత, మాజీ మున్సిపల్ ఛైర్మన్ సీతారామ్ గతంలోనే ముఖ్యమంత్రికి లేఖ రాశాడని గుర్తు చేశారు. కారుమూరి అవినీతిదెబ్బకు పేదలు బలవుతున్నారని, పేదలకు ఇచ్చిన ఇళ్ల పట్టాల్లోనే కోట్లుకాజేశాడని దుయ్యబట్టారు.
తణుకు పట్టణానికి 8-10కిలోమీటర్లదూరంలోని వీరభద్రాపురం-కొమరవరం రోడ్డులో గ్రీన్ ఫీల్డ్ జోన్ లోఉన్న వ్యవసాయ భూములను 2020-21 ఏడాది మొదట్లో తన బినామీలతో కారుమూరి కొనిపించాడని, దాదాపు 20ఎకరాల వరకు సేకరించారని, అదేభూమిని తిరిగి పార్క్ ల డెవలప్మెంట్ కోసమని చెప్పి, తణుకు మునిసిపాలిటీవారితో సేకరిపంచేశాడని ఆరోపించారు. ఆక్రమంలో భాగంగా తన బినామీలతో సేకరింప చేసిన భూములకు పెద్దఎత్తున టీఢీఆర్ బాండ్లను పొందారని, ఈ సమాచారమంతా ఎవరో చెబితే తాము చెప్పడంలేదని, సమాచారహక్కుచట్టం కింద సేకరించిన వాస్తవాల ప్రకారమే మాట్లాడుతున్నామని ప్రకటించారు. మేము కుకుంబర్లలా కోయించుకునే రకంకాదని, కోసి కారంపెట్టే కమాండర్లమరని బుగ్గన తెలుసుకోవాలని హెచ్చరించారు.