Site icon 123Nellore

చిగుళ్లవాపు లక్షణాలు.. చేయాల్సిన చికిత్స..!

మంచి ఆరోగ్యానికి నోటి ఆరోగ్యం చాలా ముఖ్యం. అందరిలో తనివితీరా నవ్వాలంటే నోటిలో ఎటువంటి వ్యాధులు సంభవించకూడదు. అయితా చాలా మంది చిగుళ్ల నొప్పులతో బాధపడుతుంటారు. చిగుళ్ళ వాపు, చిగుళ్ళ నుండి రక్తం కారడం వంటి లక్షణాలు చిగుళ్ల వాపును తెలుపుతాయి. పల్ల వలే చిగుళ్లు కూడా ఆరోగ్యంగా ఉంటాయి. గట్టిగా, శుభ్రంగా గులాబీ రంగులో చిగుళ్లు ఉండాలి. అయితే చిగుళ్లు వాసినప్పుడు ఎర్రగా, నొప్పిగా ఉంటాయి.  చిగుళ్లను నిర్లక్ష్యం చేస్తే దంతాలను కోల్పోయే ప్రమాదం ఉంది. సరిగా నోటి పరిశుభ్రతను పాటించకపోవడం, పళ్లలో, చిగుళ్ళ పళ్ల మధ్యన పాచి పేరుకుపోవడంతో వల్ల చిగుళ్ళవాపును కలిగిస్తుంది.

చిగుళ్ళ నుండి రక్తస్రావం నొప్పి నోటి దుర్వాసన చిగుళ్ళు ఎర్రగా అవ్వడం, వాపు, మధ్య సందులు ఏర్పడతాయి. చిగుళ్ళు, దంత సంరక్షణలో విటమిన్ సి బాగా పని చేస్తుంది. విటమిన్ బి12 దంతక్షయాన్ని, చిగుళ్ళ వాపును తగ్గిస్తుంది. అయితే కడుపుతో ఉన్నవాళ్లకు చిగుళ్ళ వాపులు సాధారణంగా కనిపిస్తాయి. శరీరంలో హార్మోన్లలో సమతుల్యత లేకపోవడం, హార్మోన్ల స్థాయిలు పెరగడంతో వల్ల చిగుళ్ళకు రక్తసరఫరా క్రమంగా పెరగుతుంది. అయితే ఈ నొప్పి నుండి బయటపడాలంటే.. రెండు వారాలు మించి వాపు ఉంటే వెంటనే దంతవైద్యులను సంప్రదించాలి.

నోటి పరిశుభ్రత కు వాడే లిక్విడ్స్, డెంటల్ పేస్ట్ వాడాలని సూచించే అవకాశం ఉంది. ఇవి వాడటం వల్ల చిగుళ్ళవాపు తగ్గడంతో పాటు పళ్లలో పేరుకుపోయిన పాచిని తగ్గిస్తాయి. మరీ చిగుళ్ళ వాపు ఎక్కువగా ఉంటే శస్త్రచికిత్స తప్పనిసరి. సర్జరీలో స్కాలింగ్, రూట్ ప్లానింగ్ వంటివి ఉంటాయి. ఈ ప్రక్రియలో దంతవైద్యుడు వ్యాధిగ్రస్తులైన వారిలో చిగుళ్ళుకు సంబంధించిన వ్యాధిని దూరం చేస్తారు. దంతాలపై పేరుకున్న గార, పాచి, చిగుళ్లు-దంతాల మొదళ్ళలో ఏర్పడ్డ పాచిని తొలగించి మంచిగా ఉండేలా చేస్తారు.

 

 

Exit mobile version