Supritha: టాలీవుడ్ ప్రేక్షకులకు యాక్టర్ సురేఖ వాణి గురించి ప్రత్యేకించి పరిచయం అక్కర్లేదు. యాంకర్ గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ప్రేక్షకుల్లో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. పలు సినిమాలలో హీరోకు అక్క, వదిన పాత్రలతో ప్రేక్షకులను మైమరిపించింది.
ఈ మధ్య కొంత కాలం సినిమాలకు దూరంగా ఉన్న సురేఖ. సోషల్ మీడియాలో బాగానే చురుకుగా ఉంటుంది. తన కూతురు సుప్రితతో కలిసి ఇన్ స్టా గ్రామ్ లో తెగ హడావిడి చేస్తూ ఉంటుంది. ఎప్పటికప్పుడు వీరిరువురు గ్లామర్ పోస్ట్ లను, వీడియోలను అప్ డేట్ చేస్తూ ఉంటారు.
సోషల్ మీడియాలో చురుకుగా ఉంటూ ఈ మధ్యకాలంలో నెటిజన్ల తో ర్యాపో బాగా పెంచుకున్నారు. ఇదిలా ఉంటే తన కూతురు సుప్రిత, రాఖీ జోర్డాన్ తో కలిసి ఓ ప్రైవేట్ ఆల్బమ్ చేసింది. ఇక ఆ ఆల్బమ్ విడుదలైన తరువాత వాళ్ళిద్దరూ ప్రేమ పెళ్లి చేసుకుంటున్నారని సోషల్ మీడియాలో పుకార్లు షికార్లు కొట్టాయి.
తాజాగా సుప్రిత ఈ విషయంపై స్పందించింది. “నా పెళ్లి గురించి ఏ విషయమైనా మా అమ్మగారే స్పందిస్తారు. అందరూ నాకు ఫోన్ చేసి పెళ్లిచేసుకుంటున్నావా అని అడుగుతున్నారు. నేను ఏమి పెళ్లి చేసుకోవడం లేదు. ఇక నేను ఎవరి ప్రేమలో కూడా పడలేదు” అంటూ పలు విషయాలు తో నెటిజన్ల పై కొంచెం ఘాటుగా స్పందించింది సుప్రిత.