Site icon 123Nellore

సుడిగాలి సుధీర్ హీరోగా సస్పెన్స్ థ్రిల్లర్.. ఆకట్టుకున్న టీజర్..!

సుడిగాలి సుధీర్‌.. పరిచయం అక్కర్లేని పేరు. ‘జబర్దస్త్’ కామెడీ షో ద్వారా మంచి క్రేజ్ తెచ్చుకున్న ఆర్టిస్టులలో సుడిగాలి సుధీర్ ఒకడు. ఎక్స్ట్రా జబర్దస్త్’, ‘ఢీ’, ‘శ్రీదేవి డ్రామా కంపెనీ’ ప్రోగ్రామ్స్‌లో ఆయన చేసే స్కిట్స్, యాంకరింగ్ ఆడియ‌న్స్‌కు ఎంట‌ర్‌టైన్‌మెంట్‌ అందిస్తుందని చెప్పడంలో ఎటువంటి సందేహం అవసరం లేదు. వెండితెరపై ఇప్పటి వరకూ సుధీర్ చేసిన పాత్రలు, హీరోగా చేసిన సినిమాలు కూడా కామెడీ నేపథ్యంలో సాగాయి. అయితే… ‘కాలింగ్ సహస్ర’తో ఆయన రూట్ మార్చినట్టు ఉన్నారు. సుధీర్‌ తాజా చిత్రం ‘కాలింగ్ సహస్ర’ సినిమా టీజర్‌ను నిర్మాత అల్లు అరవింద్ చేతుల మీదుగా రిలీజ్ చేయించారు.

Sudigali sudheer's new movie calling sahasra teaser release

‘బ్ర‌త‌క‌డం కోసం చంప‌డం సృష్టి ధ‌ర్మం.. మ‌రి చంప‌డం కాన‌ప్పుడు దాన్ని చూపించ‌డం త‌ప్పెలా అవుతుంది’ అంటూ మొద‌లైన టీజ‌ర్ ప్రేక్షక జనాలను ఆక‌ట్టుకుంటుంది. సైబ‌ర్ సెక్యూరిటి ప్రొఫెష‌న‌ల్‌గా సుధీర్ ఆక‌ట్టుకుంటున్నాడు. మాస్ హీరోకి ఏమాత్రం తీసి పోనీ రీతిలో ఆయనతో ఫైట్స్ చేయించారు. టీజ‌ర్ భ‌యాన‌కంగా ఆధ్యాంతం ఆక‌ట్టుకుంటుంది. కొత్త సిమ్ కార్డు తీసుకున్న హీరో జీవితంలో ఊహించని ఘటనలు జరగడం, వాటి నుంచి హీరో ఎలా బయట పడ్డాడనేది కథగా తెలుస్తోంది.

Calling Sahasra Teaser | Sudigali Sudheer, Dollysha, Siva balaji | V Arun | Mohit | Vijesh Tayal

సైక‌లాజిక‌ల్ థ్రిల్ల‌ర్‌గా తెర‌కెక్కిన ఈ చిత్రంలో సుధీర్‌గా జోడిగా డాలీషా హీరోయిన్‌గా న‌టించింది. శివ బాలాజీ కీల‌క‌పాత్ర‌లో న‌టించాడు. విజేష్ తాయ‌ల్, క‌టూరి వెంక‌టేశ్వ‌రులు, పామిడి చిరంజీవి సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించారు.  ప్ర‌స్తుతం ఈ చిత్రం షూటింగ్‌ చివ‌రి ద‌శ‌లో ఉంది.  వేసవి కానుకగా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

Exit mobile version