Strange Snake : మన చుట్టుపక్కల అనేక రకాల కీటకాలను, చిన్న జాతి పాములను చూస్తూ ఉంటాం. కానీ ఇంకా ఎన్నో రకాల జీవులను మనం చూడలేదనే చెప్పవచ్చు. దానికి ఈ సుత్తి తల పాము ఉదాహరణగా నిలిచింది. సుత్తి తల పాము గురించి మీకు తెలుసా అసలు. చాలా వరకు మీరు దీని గురించి విని ఉండరు. అసలు పేరే విచిత్రంగా అనిపిస్తుంది కదా.. ఇక ఆ పాము తల మేకులు కొట్టడానికి వాడే సుత్తిని పోలి ఉంటుంది.
కాబట్టి దానికి ఆ పేరు వచ్చింది. అది చాలా డేంజర్ పాము. దాని గురించి ఇప్పుడు మనం కొన్ని ఆశ్చర్యకరమైన నిజాలు తెలుసుకుందాం. ఇది చిన్నగా వాన పాము లాగానే ఉంటుంది. చిన్నగా పాకుతుంది. కానీ ఇది తన శత్రువుల్ని వెంటనే నీరుగా మార్చేసి తాగుతుంది. మీకు ఆశ్చర్యంగా ఉంది కదా. అదే దాని ప్రత్యేకత. ఈ ప్రత్యేకతకు తగ్గట్టుగా దీనికి సైంటిఫిక్ నేమ్ బైపాలియం గా పేరుపొందింది.
ఈ పాము చూడడానికి చిన్న పాటి నత్తలా కనబడుతుంది. కానీ ఇది శత్రువుల్ని తనదైన స్టైల్లో వేటాడుతుంది. సాధారణంగా ఈ పాము వానపాములను తింటుంది. వానపాము దాని కంటపడగానే ఓ రకమైన ద్రవాన్ని లీక్ చేస్తుంది. అంతే ఆ తర్వాత ఆ వానపాము విచిత్రంగా చనిపోతుంది. సుత్తి తల పాము విడుదల చేసిన ద్రవం టెట్రోడోక్సిన్. ఇది అత్యంత విషపూరితమైన కెమికల్. ఈ రసాయనం తగలగానే వానపాము నీరులా మెత్తటి జ్యూస్ లా మారిపోతుంది. అప్పుడు ఈ సుత్తి తలపాము తాగేస్తుంది.