Site icon 123Nellore

మీరు ఈ మాస్క్ లు ఉపయోగిస్తున్నారా అయితే ఏం జరుగుతుందో చూడండి!

Ominron Variant: గత రెండు సంవత్సరాల నుండి ప్రజలు కరోనా ప్రభావం కారణంగా మాస్కు ధరించకుండా బయటికి రావడం లేదు. ఈ క్రమంలో అనేక రకాల మాస్క్ లు వచ్చి పడ్డాయి. ఇక చాలా మంది ఈ మాస్క్ లు ధరిస్తున్నారు కానీ.. ఎలాంటి మాస్క్ ధరిస్తే.. మంచిదన్న అవగాహన చాలామందికి లేదనే చెప్పవచ్చు. దీంతో దాన్ని వల్ల కూడా సమస్యలు వస్తున్నాయి. అందుకే ఇప్పుడు మనం ఎలాంటి మాస్కులు ధరించకూడదో తెలుసుకుందాం.

చాలామంది క్లాత్ మాస్కులు ఉపయోగిస్తున్నారు. కానీ మాస్కులు కోవిడ్ నుంచి మనల్ని ఏ మాత్రం రక్షించవు అని డాక్టర్లు వెల్లడిస్తున్నారు. ఈ మధ్యకాలంలో వచ్చిన ఒమిక్రాన్ అనేది అనేక ప్రభావాలు కలిగి ఉంటుంది. దాంతో అది తొందరగా వ్యాపించే అవకాశం ఉంది. కాబట్టి క్లాత్ మాస్క్ లు ఒమిక్రాన్ భారీ నుంచి కాపాడలేవని తెలుస్తుంది.

సాధారణంగా అందరూ గుడ్డ మాస్కు లు ఉపయోగించడానికే ఇష్టపడుతున్నారు. అందరూ వీటిని ఎంచుకోవడానికి కారణం సౌకర్యంగా ఉంటాయని. కానీ సర్జికల్ మాస్ లు రూపంలో గుడ్డ మాస్క్ లను వాడాలని నిపుణులు చెబుతున్నారు. ఇక ఒకసారి ఉపయోగించిన మాస్క్ రెండోసారి ఉపయోగించకుండా ఉండేలా ఉండడం మంచిదని అంటున్నారు.

సర్జికల్ మాస్క్ లను ఫస్ట్ టర్మ్ మాత్రమే ఉపయోగించాలి. ఇవి వదులుగా తగిన భద్రతను కల్పించడంలో బాగా సహాయపడుతాయి. సర్జికల్ మాస్కులు వస్తువులను బాగా ఫిల్టర్ చేసే మెటీరియల్ తో తయారు చేస్తారు. కాబట్టి ఈ వాడకం కోవిడ్ నుంచి రక్షించడానికి బాగా సహాయపడుతాయి.

Exit mobile version