సామాన్యులకే కాదు సెలబ్రిటీలకు కోర్టులు, కేసులు తప్పడం లేదు. తాజాగో ఓ స్టార్ హీరో తన మాజీ భార్య టార్చర్ పెట్టిందంటూ.. కోర్టులో కేసు పెట్టాడు. పైరెట్స్ ఆఫ్ ది కరేబియన్ చిత్రంతో ప్రపంచవ్యాప్తంగా పేరుతెచ్చుకున్న హీరో జానీ డెప్. ఇక గత కొన్నిరోజుల నుంచి జానీ కోర్టులో తన మాజీ భార్యతో పోరాడుతున్నాడు. తాజాగా మాజీ భార్య రాసిన వ్యాసంపై రూ.380కోట్ల పరువు నష్టం దావా వేశాడు.
హాలీవుడ్ స్టార్ హీరో జానీ డెప్, నటి అంబర్ హెర్డేన్ మూడేళ్లు డేటింగ్లో ఉన్నారు. ఆ తర్వాత 2015లో వీరువివాహం చేసుకున్నారు. అయితే పెళ్లయిన ఏడాదికి వీరిద్దరి మధ్య విభేదాలు తలెత్తడంతో విడాకులు తీసుకున్నారు. అయితే జానీ డెప్‌తో విడిపోయినప్పటికీ తనని గృహ హింసకు గురి చేస్తున్నట్లు అంబర్ హెర్డ్ వాషింగ్టన్ పోస్ట్ కథనం ప్రకారం వెల్లడించారు. దీంతో దీనిని వ్యతిరేకిస్తూ జానీ డెప్ కోర్టును ఆశ్రయించాడు. తన మాజీ భార్యపై రూ.380 కోట్ల రూపాయల పరువు నష్టం దావా వేశాడు.
ప్రస్తుతం ఈ కేసు వర్జీనియా కోర్టులో కొనసాగుతోంది. “నేను ఇంటి నుండి బయలుదేరడానికి చాలాసార్లు ప్రయత్నించినప్పుడు.. ఆమె నన్ను సెక్యూరిటీ గార్డులతో కలిసి ఎలివేటర్ వద్ద ఆపి ఏడుస్తూ.. అరుస్తూ..“నువ్వు లేకుండా నేను జీవించలేను. నేను చనిపోతాను. కానీ నువ్వు బయటికి రావాలి“ అని అడిగేదని జానీ ఆరోపించాడు. అంతే కాదు అర్ధరాత్రి ఇంటి పైకి వస్తువులు విసిరేసేదని చెప్పుకొచ్చాడు. అలాగే అసభ్యకరమైన మాటలతో తనను వేధిస్తూ, మానసిక వేదనకు గురి చేసేదని చెప్పాడు. వైన్ గ్లాస్, టీవీ రిమోట్ తన తలపైకి విసిరేదని, ఇష్టం వచ్చినట్టు వ్యవహరించేదని చెప్పారు. బెడ్ పై మలం ఉంచేదని జానీ చెప్పుకొచ్చారు. దీనికి సంబంధించి కోర్టులో సాక్ష్యమిచ్చారు జానీ డెప్. ఈ కేసు విచారణ వాయిదాపడింది. వచ్చే వారం తిరిగి విచారణ కొనసాగనుంది. కాగాప్రస్తుతం జాన్ మాటలు నెట్టింట వైరల్ గా మారాయి.