Site icon 123Nellore

శ్రీ‌లంక‌లో ఆర్థిక సంక్షోభం లీట‌రు పాలు రూ. 1,195..!

ఓ ప‌క్కా ర‌ష్కా – ఉక్రెయిన్ దేశాల్లో యుద్ధం కొసాగుతుండ‌టంతో ఆర్థిక సంక్షోభం త‌లెత్తింది. మ‌రో ప‌క్కా ఎలాంటి యుద్ధం చేయ‌కుండానే శ్రీ‌లంక లో ఆర్థిక సంక్షోభం తలెత్తింది. ప్ర‌స్తుతం శ్రీ‌లంక ఆప్పుల్లో కూరుకుపోయింది. దీంతో చేసిన అప్పుల‌కు వ‌డ్డీలు క‌ట్టలేక ఆ దేశ ప్రధాని ఆధ్య‌క్షుడు మ‌హేంద్ర రాజ‌ప‌క్ష‌ చేతులు ఏత్తిన ప‌రిస్థితి ఏర్ప‌డింది. ఆర్థిక సంక్షోభం ఎలా ఉందంటే విద్యార్థుల‌కు ప‌రీక్ష‌లు నిర్వ‌హించ‌డానికి ఇంక్ కూడా లేదంటే ఆక్క‌డి ప‌రిస్థితి ఎలా ఉందో మ‌నం ఆర్థం చేసుకోవ‌చ్చు .

Sri Lanka declares economic emergency to contain food prices

సాధార‌ణంగా లీట‌రు పాలు 40 రూపాయ‌లు ఉందంటే మ‌నం కొనుగునేందుకు కొంచెం ఆలోచిస్తాము. అలాంది శ్రీ‌లంక‌లో లీట‌రు పాటు రూ. 1195కి చేరుకుంది. గ్యాస్ ధ‌ర 2వేల 5వంద‌ల‌పైనే ఉంది. మ‌రోవైపు చికిన్ ధ‌ర వెయ్యి రూపాయ‌లు ఉంటే .. ఒక్కొ గుడ్డు ధ‌ర 35రూపాయ‌లు ప‌లుకుంది. అలాగే పంచ‌దార కిలో ధ‌ర 130 నుంచి 200 వంద‌ల‌కు పెరిగింది.ప‌రీక్ష‌లు వాయిదా వేయ‌డంతో 40 ల‌క్ష‌ల మంది విద్యార్థుల్లో 35ల‌క్ష‌ల మంది తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

దేశంలో దిగుమ‌తులు త‌గ్గిపోవడంతో ఇంధ‌నం, నిత్యావ‌స‌ర స‌రుకులు, చ‌మురు ధ‌ర‌లు విప‌రితంగా పెరిగిపోయాయి. దేశంలో త‌లెత్తిన ఆర్థిక సంక్షోభంపై దేశ‌ ప్ర‌ధానిపై అక్క‌డి ప్ర‌జ‌లు ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు. మ‌రోవైపు దేశంలో ఆక‌లి కేక‌లుపెరిగాయి.శ్రీ‌లంక అంటే టూరిస్టు దేశంగా పిలుస్తున్నారు. ఎక్కువ‌గా అక్క‌డి నుంచే ఆదాయం వ‌స్తుంది. కానీ క‌రోనా కార‌ణంగా టూరిస్టూ ప్ర‌దేశాలు మూత‌ప‌డ్డాయి. మ‌రోవైపు చైనా నుంచి ఎక్కువ మొత్తంలో అప్పులు చేసింది. ఇప్ప‌టికే ఇండియా కొంత మేర శ్రీ‌లంక కు సాయం చేసిన‌.. సంక్షోభం త‌గ్గిన ప‌రిస్థితి ఏర్ప‌డింది.

Exit mobile version