ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్ ప్రభుత్వంపై ప్రతిపక్షాలు తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నాయి. ఆయన చేతకాని పాలనతో రాష్ట్రాన్ని సర్వనాశనం చేస్తున్నారంటూ మండిపడుతున్నారు. తాజాగా, ఏపీ బీజేపీ చీఫ్ సోము వీర్రాజు మరోసారి జగన్‌పై మాటలతో విరుచుకుపడ్డారు. రాష్ట్రంలో జగన్ హిట్లర్‌లా నియంత పాలన సాగిస్తున్నారని అన్నారు. ఆయన చేపడుతున్న ప్రతి కార్యం ప్రజలకు వ్యతిరేకంగానే ఉందని ఆరోపించారు. ముఖ్యంగా రాష్ట్రంలో ఒక ట్రాక్టర్ ఇసుక ధర రూ. 18వేలకు అమ్ముతుండటం దారుణమని అన్నారు.
మధ్య, పేద తరగతి కుటుంబాలు ఇంత మొత్తం చెల్లించుకోవాలంటే తీవ్ర భార పడుతుందని.. పేదలకు అండగా ఉంటామని చెప్పిన జగన్.. ఇప్పుడు వాళ్ల చావుకు కారణమవుతున్నారని ఆరోపించారు. కాగా, గత ప్రభుత్వంతో పాటు ప్రస్తుత ప్రభుత్వాలు కలిసి అమ్మేసిన ప్రభుత్వ సంస్థల గురించి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రస్తావించాలని వీర్రాజు కోరారు. ఇక జగన్ ప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చిన ఓటీఎస్ పథకాన్ని నిలిపేయాలని.. పేదలకు ఉచితంగా ఉళ్ల పట్టాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ విధానంతో పేదలకు భారీ నష్టం వాటిల్లుతుందని అన్నారు. ఇప్పటికైనా జగన్ కళ్లు తెరిచి నిజాన్ని చూడాలని.. ప్రజలకు ఆయన నిర్ణయాలతో అలమటించిపోతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
జగన్ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి నిత్యవసర సరుకులతో పాటు అనేక వాటిల్లో ధరలు ఆకాశాన్నంటాయి. ముఖ్యంగా మధ్యం ప్రియలుకు తాగకుండానే ఆ ధరలు చూస్తుంటే తాగకుండానే చుక్కలు కనిపిస్తున్నాయి. మరోవైపు, నిత్యవసర సరుకులు కొనాలంటేనే పేదలు భయపడుతున్నట్లు ప్రతిపక్ష నాయకులు ఆరోపిస్తున్నారు.