జమ్ము కశ్మీర్ కు సంబంధించిన ఓ వీడియో ప్రస్తుతం వైరల్ గా మారింది. ఈ కాలంలో అక్కడ చాలా ప్రాంతాలు అంతా కూడా మంచుతో కప్పబడి ఉంటాయి. మంచు ఎలా ఉంటుంది అంటే రోడ్డుపై దట్టంగా పేరుకు పోయి ఉంటుంది. దాని దాటుకోవాలి అంటే చాలా కష్టంగా ఉంటుంది. అందుకు అధికారులు ఎప్పటికప్పుడు అక్కడ ఉండే మంచును ముఖ్యంగా రోడ్లపై ఉండే మంచును యంత్రాల సాయంతో తొలగిస్తారు. ఈ క్రమంలోనే ఈ రోజు అలానే చేశారు. అయితే ఇలా మంచును తొలగించే వీడియో ఒకటి ప్రస్తుతం వైరల్ గా మారింది.
జమ్ముకశ్మీర్‌లో మొఘల్ రోడ్డుపై చాలా మంచు ఉంది. ఆ మంచును తొలిగించే ప్రక్రియను ఇంజనీరింగ్ అధికారులు శర వేగంగా కొనసాగిస్తున్నారు. జమ్ము కశ్మీర్ లోని పూంచ్, షోపియాన్ జిల్లాలు రెండు వైపుల నుంచి ట్రాఫిక్‌ను పునరుద్ధరించే ప్రక్రియను కొనసాగిస్తున్నారు. రెండు వైపులా వాహనాలు భారీగా నిలిచి పోయాయి. దీంతో అధికారు యంత్రాంగా కదిలి ఆగ మేగాల మీద పరులు పెట్టింది. ఈ ఏడాది మంచు తక్కువగా పడడంతో పూంచ్- రాజౌరి జిల్లా లను కశ్మీర్ లోయతో అనుసంధానించే పనులు చాలా ముందుగానే చేపట్టినట్లు అధికారులు తెలిపారు.
#WATCH Jammu & Kashmir | Snow clearing operation underway in Pir Panjal mountain range for operation of Mughal Road in Rajouri pic.twitter.com/L4zxWXXUF3
— ANI (@ANI) March 19, 2022
పీర్ పంజాల్ పర్వత శ్రేణుల వెంబడి కొండచరియలు విరిగిపడిన మార్గాల్లోనూ పనులు చురుగ్గా కొనసాగుతున్నాయి. అవసరమైన చోట్ల రహదారులను పునర్నిమిస్తున్నారు. వాతావరణ పరిస్థితులు ఇలాగే అన్నీ అనుకూలిస్తే ఏప్రిల్ 15 కల్లా పనులు పూర్తవుతాయని ఇంజనీరింగ్ అధికారులు వెల్లడించారు.